Solar and Lunar Eclipse: సైన్స్ గ్రహణాలను ఖగోళ సంఘటనగా పేర్కొంటే.. హిందూ జ్యోతిష్యశాస్త్రం మాత్రం అశుభకరమైన సంఘటనగా పరిగణిస్తుంది. సూర్య, చంద్ర గ్రహణాలు ఒకే నెలలో రావడం చాలా అరుదు. ఈ సంవత్సరం ఏర్పడబోయే చివరి సూర్య, చంద్ర గ్రహణాలు అక్టోబరు నెలలో సంభవించబోతున్నాయి. ఒక గ్రహణం భారతదేశంలో కనిపిస్తే, మరొకటి కనిపించదు. సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు ఏర్పడబోతున్నాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యగ్రహణం ఎప్పుడు?
ఈ ఏడాది పితృ పక్షం చివరి రోజున రెండవ లేదా చివరి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. పైగా ఈ రోజు అమావాస్య కూడా. 2023 చివరి సూర్యగ్రహణం 14 అక్టోబర్ 2023న సంభవించబోతుంది. భారత కాలమానం ప్రకారం, ఈ గ్రహణం అక్టోబర్ 14, 2023 రాత్రి 8:34 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 2:25 గంటలకు ముగుస్తుంది. ఇది భారతదేశంలో కనిపించదు కాబట్టి, దాని సూతక్ కాలం చెల్లదు. ఈ సూర్యగ్రహణం కన్యారాశి మరియు చిత్ర నక్షత్రాలలో ఏర్పడబోతుంది. ఇది ప్రధానంగా పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మరియు ఆర్కిటిక్ వంటి దేశాలలో కనిపిస్తుంది. 2023లో గతంలో వచ్చిన రెండు సూర్యగ్రహణాలు కూడా భారతదేశంలో కనిపించలేదు.


చంద్రగ్రహణం ఎప్పుడు?
సాధారణంగా సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం రెండవ లేదా చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 29 మధ్యాహ్నం 1:06 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2:22 గంటలకు ముగుస్తుంది. భారతదేశంలో గ్రహణం యొక్క వ్యవధి 1 గంట 16 నిమిషాలు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది మరియు దాని సుతక్ కాలం చెల్లుతుంది. ఈ సమయంలో పూజలు చేయడం నిషిద్ధం. గ్రహణ కాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయకూడదు. ఈ చంద్రగ్రహణం భారత్‌తో పాటు, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్ మరియు ఇండోనేషియా వంటి దేశాల్లో కనిపిస్తుంది.


Also Read: Rahu Transit 2023: అక్టోబర్ 30 తేదిన మీనరాశిలోకి రాహువు సంచారం..ఈ 3 రాశులవారికి నష్టాలు తప్పవా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook