Shani Gochar 2023: 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో త్రిగ్రాహి యోగం.. ఈరాశులపై కురవనున్న డబ్బు వర్షం..
Tirgrahi Yog: కుంభరాశిలో 30 ఏళ్ల తర్వాత త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. దీని వల్ల 3 రాశుల వారు డబ్బు మరియు పురోభివృద్ధి సాధిస్తారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Shani Surya Budh Trigrahi Yog 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు సమయానికి అనుగుణంగా రాశిచక్రాలను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో సంయోగం చేస్తాయి. హోలీ సందర్భంగా శనిదేవుడు 30 ఏళ్ల తర్వాత తన సొంత రాశి అయిన కుంభరాశిలో కూర్చున్నాడు. ఇతడి లాగే దేవగురు బృహస్పతి కూడా తన ఓన్ హౌస్ అయిన మీనరాశిలో సంచరిస్తున్నాడు. పైగా కుంభరాశిలో మూడు గ్రహాల కలయిక ఏర్పడింది. శని, బుధు, సూర్యుడి సంయోగం వల్ల కుంభంలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొందరు అదృష్టం, ఐశ్వర్యం పట్టనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
త్రిగ్రాహి యోగం ఈ రాశులకు వరం
మిథున రాశి
త్రిగ్రాహి యోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో తొమ్మిదో స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది. దీంతో అదృష్టం మీ వెంటే ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. విదేశాల్లో నివశించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆర్థికంగా బలపడతారు.
కుంభ రాశి
త్రిగ్రాహి యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశితో లగ్నస్థ గృహంలో ఈ యోగం ఏర్పడుతోంది. అందుకే ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా మీకు ధనలాభం కలుగుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. వ్యాపారవేత్తలు తీసుకున్న రుణం తిరిగి చెల్లిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి త్రిగ్రాహి యోగం ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ యోగం మీ కర్మస్థానంలో ఏర్పడుతుంది. మీరు కొత్త జాబ్ ఆఫర్‌ను పొందుతారు. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. పాలిటిక్స్ లో ఉన్నవారు మంచి పదవి పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది.
Also Read: Mangal Gochar 2023: మిథునరాశిలోకి ప్రవేశించబోతున్న కుజుడు.. హోలీ తర్వాత మారనున్న ఈరాశుల జాతకం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook