Sun Transit into Aries on 14th April 2023:  ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. ఆదిత్యుడు ప్రతి నెలా తన రాశిని ఛేంజ్ చేస్తాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పునే మనం సంక్రాంతి అని పిలుస్తాం. ఏప్రిల్ 14, మధ్యాహ్నం 03.12 గంటలకు భానుడు మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మేష సంక్రాంతి అని అంటారు. ఇదే రాశిలో సూర్యుడు నెలరోజులపాటు ఉంటాడు.  అనంతరం మేషరాశిని విడిచిపెట్టి మే 15వ తేదీ 11.58 గంటలకు వృషభరాశిలో సంచరిస్తాడు. మేషరాశిలో సూర్యుడి గోచారం వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: సూర్యుని రాశి మార్పు మేషరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఎందుకంటే ఇదే రాశిలో సూర్యుడి గోచారం జరుగుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. 


మిథునం: ఈ సూర్య సంచారం మిథునరాశి వారికి కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. డబ్బును బాగా ఆదా చేస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఫారిన్ ట్రిప్ వెళ్లే అవకాశం ఉంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. 


Also Read: సూర్య మహాదశ ఎఫెక్ట్.. వచ్చే 6 ఏళ్లు మీకు డబ్బే డబ్బు...లాభాలే లాభాలు..


సింహ రాశి: సూర్యుడి గోచారం సింహ రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రాశివారికి ఎల్లప్పుడూ ఆదిత్యుడి అనుగ్రహం ఉంటుంది. మీ కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 


వృశ్చికం: సూర్యుని గమనంలో మార్పు వృశ్చిక రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో లాభాలను ఇస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ప్రమోషన్ లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. 


Also Read: Maha Lakshmi Rajyog 2023: మరి కొన్ని గంటల్లో మహాలక్ష్మి యోగం.. మారనున్న ఈ రాశివారు అదృష్టం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook