Shukra Rashi Parivartan 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, లవ్, రొమాన్స్, అందం, ఆనందం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ఇతడిని రాక్షసుల గురువు అని కూడా పిలుస్తారు. మరో వారం రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. జూలై 07న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. సింహరాశిలో శుక్రుడు సంచారం విపరీతమైన శుభయోగాన్ని ఏర్పరుస్తుంది. దీని వల్ల 5 రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం: కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కెరీర్‌కు సంబంధించిన శుభవార్త వింటారు. మీ వ్యాపారం మంచి లాభాలను ఇస్తుంది.


కన్య: ఈ శుక్ర సంచారం కన్యారాశి వారికి సుఖ సంతోషాలను ఇస్తుంది. ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన పనులు చేసే వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఫారిన్ వెళ్లాలనే మీ కోరిక కూడా నెరవేరుతుంది. సంపాదన పెరుగుతుంది. మీరు మీ లగ్జరీ లైఫ్ కోసం భారీగా ఖర్చు చేస్తారు. 


వృషభం: శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. మీకు ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు ప్రతి విషయంలో అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఏదైనా విలువైన వస్తువు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.


Also Read: Shani Trayodashi 2023: శని త్రయోదశి ప్రాముఖ్యత, శని వ్రతం పాటించడం వల్ల కలిగే లాభాలు, పూజా విధానం..


తుల రాశి: శుక్రుడు తులారాశికి అధిపతి.  ఇతడి సంచారం ఈ రాశి మంచి లాభాలను ఇస్తుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో మీ ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. సీనియర్ అధికారుల సపోర్టు లభిస్తుంది. 


కుంభం: శుక్రుని సంచారం వల్ల కుంభ రాశి వారికి ఐశ్వర్యం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Shani Vakri: తిరోగమన శనితో ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook