Shani Trayodashi 2023: శని త్రయోదశి ప్రాముఖ్యత, శని వ్రతం పాటించడం వల్ల కలిగే లాభాలు, పూజా విధానం..

Shani Trayodashi 2023: శని త్రయోదశి రోజున శని దేవుడికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి వ్రతాన్ని పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శని త్రయోదశి రోజున శనిదేవున్ని ఎలా పూజించాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 30, 2023, 09:50 PM IST
Shani Trayodashi 2023: శని త్రయోదశి ప్రాముఖ్యత, శని వ్రతం పాటించడం వల్ల కలిగే లాభాలు, పూజా విధానం..

 

Shani Trayodashi 2023: భారతీయులు శివుడి అనుగ్రహం కోసం ప్రదోష వ్రతాన్ని పాటిస్తారు. అయితే దేవ గురు శని అనుగ్రహం కోసం కూడా శని త్రయోదశి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ త్రయోదశికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రోజు శని దేవుడు ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి రోజున శని దేవుడికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల కూడా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే ఏయే నియమాలతో వ్రతాన్ని పాటించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రతి సంవత్సరం  శుక్ల పక్షంలోని శని త్రయోదశిని జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం త్రయోదశి 1 జూలై వచ్చింది. ఈ రోజు సాడే సతి, రాహు-కేతు సమస్యలతో బాధపడేవారు శని దేవుడికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ వ్రతంలో భాగంగా మంత్రాలు పఠించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దాన కార్యక్రమాలు చేయడం కూడా శుభ పరిణామంగా భావిస్తారు. 

Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
శని త్రయోదశి రోజున చేయాల్సిన పనులు:
❃ శని త్రయోదశి రోజున తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేవాల్సి ఉంటుంది.
❃ ఆ తర్వాత తలస్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది.
❃ మీ దగ్గరలో ఉన్న శని దేవుని ఆలయానికి లేదా హనుమంతుని ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
❃ ఆ తర్వాత దేవాలయంలో ఉన్న శని విగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి.
❃ ఇలా అభిషేకం చేసిన తర్వాత శని దేవుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి.
❃ అంతేకాకుండా శని దేవునికి ఎంతో ఇష్టమైన వస్తువులను తైలాభిషేకం చేసిన నూనెను వికలాంగులకు, అనాధలకు దానం చేయాల్సి ఉంటుంది.
❃ ఆ తర్వాత ఇంట్లో ఉన్న శని చిత్రపటానికి పూలమాలను సమర్పించి.. ఓ రాగి పాత్రలో ఆవనూనెను పోసుకొని నాణేన్ని అందులో వేయాలి.
❃ ఆ తర్వాత సాయంత్రం మీ దగ్గరలో ఉన్న ఉసిరి చెట్టు ముందు ప్రదక్షిణలు చేసి దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది.

శని ప్రదోష వ్రత ప్రయోజనాలు:
శుక్లపక్షంలోని త్రయోదశి రోజున శని దేవుడికి వ్రతం పాటించడం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి అంతేకాకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల రాహు కేతు చెడు ప్రభావం తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ రోజున కాలభైరవుని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. 

Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News