Venus Transit 2023 date:  జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఐశ్వర్యం మరియ లగ్జరీ లైఫ్ ను ఇచ్చే శుక్రుడు ఈ నెల చివరిలో అంటే మే 30 కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. జూలై 07 వరకు ఇతడు అదే రాశిలో సంచరించనున్నాడు. శుక్రుడి యెుక్క రాశి మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్ర సంచారం ఈ రాశులకు వరం
మేషం
శుక్రుని సంచారంతో మేష రాశి వారికి అదృష్టం పట్టనుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీకు ప్రమోషన్ లభించే ఉంటుంది. అంతేకాకుండా మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
కర్కాటకం
శుక్రుడి రాశి మార్పు కర్కాటక రాశి వారికి శుభవార్తను ఇస్తుంది. మీకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. మీకు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. 


Also Read: Shani Jayanti 2023: శని జయంతి నాడు అరుదైన యాదృచ్ఛికం.. ఇలా చేస్తే మీ కష్టాలు మటుమాయం..


వృశ్చిక రాశి
శుక్రుడి గోచారం వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. మీరు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. 
మీనరాశి
మీన రాశి వారికి శుక్రుని సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీకు పెద్ద ప్యాకేజీతో జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీకు కోరుకున్నది లభిస్తుంది. 


Also Read: Guru Gochar 2023: ఇవాళ అరుదైన గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు ప్రతి పనిలో విజయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook