Chandra Grahan 2024 effect: రేపటి నుంచే మార్చి నెల ప్రారంభం కానుంది. పండుగలు, వ్రతాలు మరియు గ్రహాల సంచారం పరంగా వచ్చే మాసం చాలా ముఖ్యమైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ నెలలోనే హోలీ పండుగ రాబోతుంది. విశేషం ఏమిటంటే.. అదే రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇలాంటి యాదృచ్చికం చాలా అరుదుగా సంభవిస్తుంది. హోలీ నాడు చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల కొందరు అనుకూల ఫలితాలు, మరికొందరు ప్రతికూల ప్రలితాలను పొందుతారు. హోలీ నాడు వచ్చే చంద్రగ్రహణం ఏయే రాశులవారిపై చెడు ప్రభావం చూపుతుంతో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి 
చంద్రగ్రహణం ప్రభావం వల్ల సింహ రాశి వారికి కెరీర్‌లో అడ్డంకులు వస్తాయి. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి అడుగు వేయండి. సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరుల అభిప్రాయాలకు విలువనివ్వండి. మీరు ఒత్తిడి నుండి బయటపడాలంటే యోగా, ప్రాణాయామం వంటివి చేయడం మంచిది. 


వృశ్చిక రాశి
గ్రహణ సమయంలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. వీరు కెరీర్ లో ఇబ్బందులను ఎదుర్కోనే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి. వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టే ముందు కాస్త ఆలోచించండి. శత్రువులు మీపై పైచేయి సాధించడానికి ఇదే మంచి సమయం, కాబట్టి కేర్ పుల్ గా ఉండాలి. ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండటానికి ట్రై చేయండి. 


Also Read: Mars transit 2024: మార్చిలో రాశిని మార్చబోతున్న కుజుడు.. ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..


మిధునరాశి
హోలీ పండుగ నాడు మిథునరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఈ సమయంలో ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు కాస్త ఆలోచించండి. ఈ సమయంలో పెట్టుబడులకు దూరంగా  ఉండండి,  వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూస్తారు. భార్య భర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Shukra Gochar 2024: త్వరలో శుక్రుడు-రాహువు కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook