COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mercury Transit Effect On 3 Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రంలో తెలివితేటలు, వివేకం, సంపదకు సూచికగా భావించే బుధ గ్రహం రాశి సంచారం చేసినప్పుడు ప్రత్యేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ గ్రహం ఒకే రాశిలో ఇతర రాశి తో కలవడం వల్ల జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక శుభ యోగాలు ఏర్పడతాయి. అయితే బుధ గ్రహం జనవరి 15న మకర రాశిలోకి సంచారం చేయగా.. ఫిబ్రవరి 13 వరకు సంచార దశలోనే ఉండబోతోంది. అంతేకాకుండా ఫిబ్రవరి 1వ తేదీన మకర రాశిలో ఉన్న బుధ గ్రహ కదలికల్లో మార్పులు రాబోతున్నాయి. దీని కారణంగా ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ ప్రత్యేక యోగం ఫిబ్రవరి 1వ తేదీన ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాజయోగం వల్ల ఏయే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


మేష రాశి:
ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా మేష రాశి వారికి కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. కాబట్టి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కష్టపడి చదవడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరికి మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దీంతోపాటు జాబ్ ఆఫర్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. 


సింహరాశి:
సింహ రాశి వారికి అఖండ విజయాలు సాధించడానికి ఇదే సరైన సమయం గా భావించవచ్చు.  ఈ సమయంలో వీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకున్న లాభాలు పొందుతారు. ఈ రాజయోగం కారణంగా ఇంతకుముందు అప్పుగా ఇచ్చిన డబ్బులు అన్ని సులభంగా తిరిగి వస్తాయి. స్నేహితుల సహకారంతో ఈ సమయంలో అన్ని పనులు చేసేందుకు ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. 


Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


 


కన్య రాశి:
బుధాదిత్య రాజయోగం వల్ల కన్య రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు పిల్లలనుంచి శుభవార్త వింటారు. అంతేకాకుండా ఆదాయ వనరులు పొంది.. ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. దీంతోపాటు పూర్వీకుల నుంచి కూడా ఆస్తులు పొందుతారు. ఈ సమయంలో ఎంతో సుఖంగా విలాసవంతంగా గడుపుతారు.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter