Chaturgrahi Yogam: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో నాలుగు గ్రహాల మహా కలయిక.. ఈ 5 రాశులకు తిరుగులేదు ఇక..
Planets Conjunction: మేష రాశిలో త్వరలో నాలుగు గ్రహాలు కలవబోతున్నాయి. 12 ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుత సంఘటన జరగబోతుంది. ఇది ఏయే రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
Chaturgrahi Yog 2023 Effects: గ్రహాలు కాలానికి అనుగుణంగా తమ రాశులను మారుస్తాయి. ఈ మాసంలో 4 గ్రహాల మహా కలయిక జరగబోతుంది. ఇప్పటికే మేషరాశిలో బుధుడు, రాహువు సంచరిస్తుండగా.. ఏప్రిల్ 14న సూర్యుడు, ఏప్రిల్ 22న గురుడు అదే రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ నాలుగు గ్రహాల సంయోగం వల్ల చతుర్గ్రాహీ యోగం ఏర్పడుతుంది. 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మేషరాశిలోకి ఎంటర్ అవ్వడం, నాలుగు గ్రహాల కలవడం యాదృచ్ఛికం కానుంది. ఈ చతుర్గ్రాహి యోగం ఏయే రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం.
చతుర్గ్రాహీ యోగం ఈ రాశులకు వరం
కన్యారాశి- మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు మీ కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
మకరం- మేషరాశిలో ఏర్పడిన చతుర్గ్రాహీ యోగం వల్ల మకర రాశి వారు కెరీర్ దూసుకుపోతుంది. మీ పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. జాబ్ సాధించాలనే కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభిస్తుంది.
మేషం- చతుర్గ్రాహి యోగం ఇదే రాశిలో రూపొందుతుంది. దీంతో మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. మీ కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.
మిథునరాశి- మేషరాశిలో నాలుగు గ్రహాల కలయిక వల్ల మీ కెరీర్ దూసుకుపోతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీరు కొత్త స్కిల్స్ ను నేర్చుకుంటారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే తగిన సమయం. ఇతరులతో సంబంధాలు బలోపేతం అవుతాయి.
కర్కాటకం - చతుర్గ్రాహి యోగం కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు కొత్త వారిని కలుసుకునే అవకాశం ఉంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం బాగుంటుంది.
Also Read: Mercury Set 2023: మేష రాశిలో అస్తమించబోతున్న బుధుడు.. ఈ 4 రాశులకు కష్టాలు మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook