EX CM Kiran Kumar Reddy: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి.. ఏ బాధ్యతలు అప్పగించినా రెడీ

EX CM Nallari Kiran Kumar Reddy Joins BJP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన ఆయన.. నేడు ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన రాజకీయం జీవితం.. చేపట్టిన పదవుల వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2023, 01:29 AM IST
EX CM Kiran Kumar Reddy: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి.. ఏ బాధ్యతలు అప్పగించినా రెడీ

EX CM Nallari Kiran Kumar Reddy Joins BJP: ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. శుక్రవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం కిరణ్‌ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని తానెప్పుడూ అనుకోలేదని అన్నారు. తమ కుటుంబం 1952 నుంచి కాంగ్రెస్‌లోనే ఉందన్నారు. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్ లేడని.. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతుందని చెప్పారు.  

వరుస ఓటముల నుంచి కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోవడం లేదని.. అందుకే తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు మాజీ సీఎం తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పతనం అవుతోందని.. హైకమాండ్ నాయకుల వినడం లేదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. అవినీతిని ఎదుర్కోవడంలో మోదీ నిబద్ధతను కూడా ఆయన కొనియాడారు. బీజేపీ అధిష్టానం తనకు ఏ బాధ్యతలు అప్పగించినా.. నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబంలో చాలా మంది కాంగ్రెస్‌లో ఉన్నారని అన్నారు. కొంతకాలం క్రితం ఆయనను కలిసినప్పుడు ప్రధాని మోదీ స్ఫూర్తితో తాను బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. అవినీతిపై తమ పోరాటాన్ని మరింత బలపరుస్తానని అన్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఇమేజ్ చాలా క్లీన్‌గా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఇది పెద్ద బూస్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కిరణ్‌ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం విషయానికి వస్తే.. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004-09 మధ్య చీఫ్ విప్‌గా.. 2009 నుంచి 2010 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ఆ తరువాత రోశయ్య స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకరించారు ఆయన. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి హైకమాండ్‌కు పంపించారు. తెలంగాణ, ఏపీగా రెండు రాష్ట్రాలుగా విభజించడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీని స్థాపించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా.. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. 

ఆ తరువాత కొంతకాలం రాజకీయంగా సైలెంట్‌గా ఉన్న కిరణ్‌ కుమార్ రెడ్డి.. 2018లో రాహుల్ గాంధీ సమక్షంలో మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆయన పెద్దగా యాక్టివ్‌గా కార్యక్రమాలు చేసింది లేదు. ప్రభుత్వంపై గట్టిగా విమర్శించిన దాఖలలు కూడా లేవు. ఇంతలో ఏమైందో ఏమోగానీ.. ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి.. తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Also Read: Girl Swallows Mobile Phone: తమ్ముడితో గొడవ.. సెల్‌ఫోన్ మింగేసిన యువతి

Also Read: Covid-19 Cases In India: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ రెండు రోజులు మాక్‌డ్రిల్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News