Zodiac Signs: వినాయకుడికి ఏయే రాశులవారు ఏయే నైవేద్యాలు సమర్పించాలో తెలుసా?
Offerings For Ganesha 9 Days: వినాయకుడి నవరాత్రుల్లో భాగంగా ఈ రాశులవారు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం వల్ల జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
Offerings For Ganesha 9 Days: భారతదేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను 10 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ పది రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాలన్ని సులభంగా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో బుద్ధి, సిద్ధిలను పూజించడం కూడా చాలా శుభప్రదమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే తరచుగా జీవితంలో ఇబ్బందులు, వృత్తిపరంగా సమస్యలతో బాధపడేవారు రాశులవారు నవరాత్రుల్లో భాగంగా గణేషుడికి ఈ నైవేద్యాలు సమర్పించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
ఏయే రాశులవారు గణేషుడికి ఏయే నైవేద్యాలు సమర్పించాలి?:
మేష రాశి:
మేష రాశి వారు తొమ్మిది రోజు పాటు వినాయకుడికి మోదకాలు సమర్పించడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి.
వృషభ రాశి:
వినాయకుడి అనుగ్రహం లభించేందుకు నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.
మిథునరాశి:
మిథునరాశి అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ తొమ్మిది రోజుల పాటు గణపతికి బూందీతో తయారు చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
కర్కాటక రాశి:
వినాయకుడి అనుగ్రహం ఎల్లప్పుడు పొందడానికి కర్కాటక రాశి వారు కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించడం చాలా శుభప్రదం.
సింహ రాశి:
సింహ రాశి వారు గణపతికి కుంకుమపువ్వుతో తయారు చేసిన ఖీర్‌ని సమర్పింయడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
కన్యారాశి:
కన్యా రాశి వారు వినాయకుడి అనుగ్రహం పొందడానికి బెల్లం, అటుకులు, నెయ్యిని కలిపిన నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలన్ని తొలగిపోతాయి.
తులారాశి:
గణేష్ చతుర్థి నవరాత్రుల్లో భాగంగా తులా రాశివారు కుడుములు, ఉండ్రాళ్ళు సమర్పించాల్సి ఉంటుంది.
మకర రాశి:
వినాయకుడి చవితి నవరాత్రుల్లో భాగంగా మకర రాశి వారు స్వామికి గర లడ్డూలను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా తొమ్మిది రోజు పాటు నైవేద్యాన్ని సమర్పించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Faceboo