Rare Raja Yoga in Navratri 2022: నవరాత్రులు ప్రారంభానికి ముందే కొందరికి అపారమైన ప్రయోజనాలు అందించనున్నాయి. ఎలా అంటే, సెప్టెంబరు 24న ఈ సారి అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఈ యాదృచ్ఛికం కారణంగా 5 రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది. సెప్టెంబరు 24న శనిదేవుడు, బృహస్పతి తిరోగమన స్థితిలో ఉంటారు. ఈ రోజునే శుక్రుడు కన్యారాశిలో సంచరిస్తాడు. కన్యారాశిలో అప్పటికే ఉన్న బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తారు. కన్యారాశిలో శుక్రుడి చేరికతో ఈ మూడు కలిసి త్రియోగాన్ని ఏర్పరుస్తాయి. ఇలాంటి అరుదైన ఘటన (Rare Raja Yoga) 59 ఏళ్ల తర్వాత జరుగుతుంది. ఈ రాజయోగం వల్ల లాభపడే ఆ 5 రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదృష్ట రాశులివే..
ధనుస్సు (Sagittarius): ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.  ఈ రాశిలోనే నీచభంగ, హంస, భద్ర అనే రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ రాశివారు వ్యాపారంలో పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.  


మిథునరాశి (Gemini): ఈ రాశి వారి కెరీర్ లో పురోగతి ఉంటుంది.  ఉద్యోగంలో బాధ్యత పెరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఈరాశిలో హన్స్ అనే రాజయోగం ఏర్పడుతోంది. దీంతో ఈరాశివారికి బిజినెస్ లో భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. 


మీనం (Pisces): ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పురోగతితో పాటు జీతం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారి జాతకంలో శనిదేవుడు లాభస్థానంలో కూర్చున్నాడు. అందువల్ల, అనేక ఇతర ఆదాయ వనరులు ద్వారా కూడా డబ్బు వస్తుంది.  మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు.


వృషభం (Taurus): ఈ సమయంలో ఈ రాశి వారి ప్రణాళికలు ఫలిస్తాయి. వ్యాపారం విస్తరిస్తుంది. మీ దగ్గర అప్పుతీసుకున్న వారు తిరిగి ఇస్తారు. కోర్టుకేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల చదువులో విషయంలో నిశ్చింతగా ఉంటారు. 


కన్య (virgo): ఈ రాశి వారికి రాబోయే కాలం శుభప్రదంగా ఉండబోతోంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం పెట్టుబడికి చాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. 


Also Read: Grah Gochar in October 2022: అక్టోబరులో సూర్య, కుజ, శని గ్రహాల సంచారం... ఈ రాశులవారికి ఊహించని ధనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook