Weekly Lucky Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరిలోని మొదటి నెలలో రెండవ వారం ఎంతో శుభప్రదమైంది. ఎందుకంటే ఈ వారంలోనే కొన్ని ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం కూడా చేయబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా ఈ వారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతోపాటు వీరు అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు. ఈ వారం ఎక్కువ లాభాలు పొందుతాయి రాశుల వారు వీరే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారికి ఈ వారం కొత్త కెరీర్ ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా ఈ వారంలో పొందే అవకాశాలు ఉన్నాయి. ఒంటరి జీవితం గడుపుతున్న వారికి ఈ వారం కొత్త భాగస్వామి పరిచయం అవుతుంది. దీంతోపాటు అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తు లభిస్తుంది.


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు ఈ వారం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చాలా శుభప్రదం ఇలా పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కూడా పొందుతారు. ముఖ్యంగా ఈ వారం ఉద్యోగాలు చేసే మహిళలకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే భాగస్వామి సపోర్టు లభించి కొత్త పనులు కూడా చేయగలుగుతారు.


Also read: First Amavasya In 2024: ఆ రోజే 2024లో మొదటి అమావాస్య..పుణ్యతిథి, శుభ ముహూర్త సమయాలు..


మీన రాశి:
మీన రాశి వారికి ఈ వారం చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి కార్యాలయాల్లో మంచి పేరు లభించి ప్రశంసలు కూడా అందుకుంటారు. ప్రేమ జీవితం గడుపుతున్న వారికి కూడా భాగస్వామి మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది. దీంతోపాటు కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా ఉంటారు.



సింహరాశి:
సింహ రాశి వారికి కూడా ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ వారంలో పెద్ద పెద్ద సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాలు చేసే వారు కొత్త ప్రణాళికలు ముందుకు వెళ్తారు. దీనికి కారణంగా లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు ఉద్యోగాలు చేసే వారికి తోటి ఉద్యోగస్తుల సపోర్టు లభించి మంచి పేరు పొందుతారు. ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారికి కూడా ఈవారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.


Also read: Makar Sankranti 2024: మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి కొత్త జీవితం ప్రారంభం..ఆస్తులు, డబ్బు రెట్టింపు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter