Astrology: 12 ఏళ్ల తర్వాత కుంభరాశిలో సూర్యుడు, గురుగ్రహాల కలయిక... ఆ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..
Astrology: సూర్యుడు, బృహస్పతి సంయోగం చాలా ముఖ్యమైనది. 12 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సూర్యుడు, బృహస్పతి కలిసి ఉండడం వల్ల ఈ 3 రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.
Sun and Jupiter conjunction in Aquarius 2022: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పును చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ప్రతి రాశిచక్రం మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ నెలలో 12 ఏళ్ల తర్వాత కుంభరాశిలో సూర్యుడు, గురుగ్రహాల సంయోగం (Sun and Jupiter conjunction in Aquarius) జరగబోతుంది. దీని ప్రభావంతో 3 రాశులవారికి మేలు జరగనుంది.
మేషం (Aries) : సూర్యుడు, బృహస్పతిల కలయిక మేషరాశి వారికి చాలా లాభదాయకం. ఈ సంయోగం ఆదాయ గృహమైన మేష రాశిలో పదకొండవ స్థానంలో ఏర్పడుతోంది. అందువల్ల, ఈ రాశి వారికి భారీ ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు, లావాదేవీలకు ఇది మంచి సమయం.
వృషభం (Taurus) : సూర్యుడు, బృహస్పతి సంయోగం వృషభ రాశి యొక్క పదో ఇంటిలో అంటే కర్మ మరియు వృత్తిలో ఉంది. అందువల్ల, ఈ కలయిక కొత్త ఉద్యోగాన్ని అందించగలదు. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. సీనియర్లతో సంబంధాలు బాగుంటాయి. అదే సమయంలో, పెద్ద వ్యాపారవేత్తలను కలిసే అవకాశం ఉంది.
మకరం (Capricorn) : సూర్యుడు, బృహస్పతి కలయిక మకర రాశి వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందగలరు. ఉద్యోగార్థులు ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందవచ్చు. ఆకస్మిక ధన లాభం కలుగుతోంది.
Also Read: Palm Reading: చేతిలో ఈ గుర్తులు ఉంటే.. అపార సంపదకు యజమానులు అవుతారట..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook