Palm Reading: చేతిలో ఈ గుర్తులు ఉంటే.. అపార సంపదకు యజమానులు అవుతారట..

Palm Reading Money Yoga: అరచేతిలో ఉండే కొన్ని గుర్తులు వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను వెల్లడిస్తాయి. ఏయే గుర్తులు దేనికి సంకేతంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 07:22 PM IST
  • హస్తసాముద్రికం చేతి గుర్తుల గురించి ఏం చెబుతుందో తెలుసా
  • ఒక్కో గుర్తుకు ఒక్కో సంకేతం, అర్థం ఉంటుంది
  • ధన యోగాన్ని సూచించే గుర్తుల గురించి హస్తసాముద్రికంలో ఏం చెప్పారో తెలుసుకోండి
Palm Reading: చేతిలో ఈ గుర్తులు ఉంటే.. అపార సంపదకు యజమానులు అవుతారట..

Palm Reading Money Yoga: హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిపై ఉండే గీతలు, గుర్తులు వ్యక్తుల జీవితంలోని ప్రతీ అంశాన్ని తెలియజేస్తాయి. వ్యక్తుల భవిష్యత్తునే కాదు.. ఆర్థిక స్థితి గతులను కూడా తెలియజేస్తాయి. హస్తసాముద్రికం ప్రకారం చేతిలో సంపద గురించి తెలియజేసే కొన్ని గుర్తులు ఉంటాయి. ఏయే గుర్తులు ధన లాభాన్ని, సంపదను సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గజలక్ష్మి యోగం

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలో పొలుసుల గుర్తు చాలా శుభప్రదం. దీని ద్వారా గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఈ గుర్తు ఎవరి అరచేతిలో ఉంటుందో.. ప్రతి క్షణం వారిని అదృష్టం వెంటాడుతుంది. అలాగే, లక్ష్మి దేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. వీరికి డబ్బు కొరత ఉండదు.

ధనపతి యోగం

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం, అరచేతిలోని ఆయు రేఖ విధి రేఖకు దూరంగా ఉంటే ధనపతి యోగం కలుగుతుంది. ఎవరి అరచేతులలో ఈ రేఖలు ఉంటాయో.. వారు చాలా అదృష్టవంతులుగా పరిగణించబడతారు. వీరికి అన్ని వైపుల నుంచి సంపద కలుగుతుంది. వీరు అపార సంపదకు యజమానులు అవుతారు.

లక్ష్మీ యోగం

శుక్రుని పర్వతం మీద కమలం గుర్తు ఉండడం వల్ల లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం, అటువంటి యోగం ఉన్న వ్యక్తులు సంపన్నులు అవుతారు. అంతేకాదు, వారితో పరిచయం ఉన్నవారికి కూడా అదృష్టం కలుగుతుంది. లక్ష్మీ యోగం ఉన్నవారు తమపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండేందుకు లక్ష్మి, విష్ణువులను పూజించాలి.

రాజలక్ష్మి యోగం

హస్తసాముద్రికం ప్రకారం అరచేతిలో శుక్రుడు, చంద్రుడు, బుధుడు, సూర్యుడు, గురు పర్వతాలు బలంగా ఉంటే రాజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. అలాంటి వారి ఆదాయం రూ.కోట్లలో ఉంటుంది. అటువంటి వ్యక్తులు వ్యాపారంలో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: TSRTC Offer: ఆర్​టీసీ స్పెషల్ ఆఫర్.. వారికి సిటీ బస్సుల్లో ఆ 2 గంటలు ఉచిత ప్రయాణం!

Also read: Hyderabad Student: తరగతి గదిలోనే గొడవపడ్డ స్టూడెంట్స్.. ఆరో తరగతి విద్యార్థి మృతి!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News