Akshaya Tritiya 2023: హిందూమతంలో అక్షయ తృతీయను అద్బుతమైన శుభ ముహూర్తపు రోజుగా పరిగణిస్తారు. అందుకే మార్కెట్ ఈ రోజున కళకళలాడుతుంటుంది. ముఖ్యంగా బంగారం, వెండి ఆభరణాలు దుకాణాలు కస్టమర్లతో రద్దీగా కన్పిస్తుంటాయి. అక్షయ తృతీయ రోజునే మేషరాశిలో పంచగ్రహీ యోగం ఏర్పడనుండటంతో మరింత మహత్యం సంతరించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్షయ తృతీయకు ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ఏదైనా శుభకార్యం జరపాలంటే ప్రత్యేకించి మంచి ముహూర్తం కోసం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శుభ కార్యక్రమమైనా తలపెట్టవచ్చు. పెళ్లి, ముండనం, గృహ ప్రవేశం, బంగారం-వెండి కొనుగోలుకు చాలా మంచి రోజు. ఈ రోజున చేసే పనికి అక్షయ ఫలం అందుతుంది. సుఖ సంతోషాలనిస్తుంది. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22న జరుపుకోనున్నారు. అదే రోజు గురుగ్రహం మేష రాశిలో గోచారం చేయనున్నాడు. దాంతోపాటు సూర్యుడు, బుధు, యురేనస్ కూడా మేషరాశిలో ఉన్నాడు. ఈ విధంగా మేషరాశిలో పంచగ్రహీ యోగం ఏర్పడుతుండటంతో కొన్నిరాశులకు అత్యంత శుభంగా మారనుంది.


కర్కాటక రాశి


కర్కాట రాశి జాతకులకు పంచాగ్రహీ యోగం అద్భుత ప్రయోజనాలనిస్తుంది. ఈ జాతకంవారికి చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఏదైనా కీలకమైన విజయాన్ని పొందవచ్చు. బంగారం, వెండి కొనుగోలు అత్యంత లాభదాయకం కానుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. 


మేష రాశి


మేష రాశిలో  పంచాగ్రహ యోగం కారణంగా ఈ రాశివారిపై అత్యంత శుభ ప్రభావం పడనుంది. ఈ రోజున 5 గ్రహాలు మేషరాశిలో ఉంటాయి. అందుకే ప్రంచాగ్రహీ యోగం ఏర్పడనుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో లాభాలుంటాయి. పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభించవచ్చు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఈ రోజున దానం చేస్తే పలురెట్లు పుణ్యం కలుగుతుందని భావిస్తారు.


వృషభ రాశి


వృషభ రాశివారికి పంచాగ్రహీ యోగం అత్యంత శుభదాయకంగా ఉంటుంది. జాతకం కుండలిలో రాజయోగం పదోన్నతి, డబ్బులు, పదవి, ప్రతిష్ఠ అన్నీ లభిస్తాయి. మీ పనులకు ప్రశంసలు అందుతాయి. మీ జీవితంలో సుఖ సంతోషాలు పెరిగి..అన్ని రకాలుగా ఆనందంగా గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుంది. కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడపగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. 


సింహ రాశి


సింహరాశి జాతకులకు అక్షయ తృతీయ ఊహించని లాభాల్ని ఇస్తుంది. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారం చేసేవారికి పూర్తిగా అనుకూలమైన సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.


Also read: Varuthini Ekadashi 2023: వరూథిని ఏకాదశి నాడు ఇలా చేస్తే చాలు..జీవితాంతం ఆర్ధిక ఇబ్బంది ఉండదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook