Varuthini Ekadashi 2023: హిందూమతంలో ఏకాదశికి అత్యంత మహత్వముంది. హిందూవుల నమ్మకాల ప్రకారం ఏకాదశి వ్రతం విష్ణు భగవానుడికి సమర్పితం. ఏకాదశి నాడు పాటించే కొన్ని ఉపాయల వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని అంటారు. ఆ వివరాలు మీ కోసం..
వైశాఖ మాసం కృష్ణపక్షం ఏకాదశి ఈసారి ఏప్రిల్ 16న వస్తోంది. ఆ రోజున వరూథినీ ఏకాదిశ వ్రతం ఆచరిస్తారు ఈ వత్రం ఆచరించడం వల్ల ఆ వ్యక్తి న్ని పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. హిందూమత ఆచారం ప్రకారం విష్ణువుని వరాహ అవతారంలో పూజిస్తారు. వరూథిని ఏకాదశి నాడు తులసి ఉపాయాలు పాటిస్తే ఆర్ధిక సమస్యలన్నీ తీరిపోతాయంటారు. ఈ రోజున విష్ణువుని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభమని జ్యోతిష్య పండితులు చెబుతారు. ఈ ఉపాయాలు ఆచరిస్తే వ్యక్తి అన్ని సమస్యల్నించి విముక్తుడౌతాడు.
1. మీ దైనందిన జీవితంలో ఏదైనా పని తరచూ ఇబ్బందులు ఎదురై ఆగిపోతుంటే..లేదా పని సరిగ్గా జరగకపోయినా వరూథినీ ఏకాదశి నాడు లక్ష్మీదేవి నీరు అభిషేకం చేయాలి. ఆ తరవాత తులసి మొక్కకు చెందిన తడి మట్టి తీసి కుటుంబసభ్యుల నుదుట బొట్టుగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి ప్రతి పని సఫలమౌతుంది.
2. వరూథిని ఏకాదశి నాడు విష్ణువుతో లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల భక్తులకు ఆర్ధిక ఇబ్బందులు దూరమైపోతాయి. ధనవర్షం కురుస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.
3. జ్యోతిష్యం ప్రకారం వరూథిని ఏకాదశి నాడు తులసి మాలతో విష్ణువుని జపిస్తే ప్రయోజనముంటుంది. ఈ ఉపాయం ఆచరించడం వల్ల వ్యక్తికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమ మంత్రాన్ని జపించాలని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.
4. వరూథిని ఏకాదశికి అత్యంత మహత్యముంది. ఈ రోజున విష్ణువును పూజించేందుకు ప్రత్యేకమైన విధి విధానముంది. తులసి మొక్క విష్ణువుకు ప్రీతిపాత్రమైనందున ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వరూథిని ఏకాదిశన ాడు విష్ణువుకు తులసి మాల అర్పించాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు త్వరగా ప్రసన్నమౌతాడు.
5. మీ జీవితంలో మానసిక సమస్యలు ఇబ్బంది పెడుతుంటే..వరూనిథి ఏకాదశి నాడు మెడలో తులసి మాల ధరించి ఉండాలంటారు జ్యోతిష్యులు. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండి చేసే పనిలో ఏకాగ్రత కుదురుతుంది.
6. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురౌతుంటే విముక్తి పొందేందుకు ఇదే మంచి అవకాశం. వరూథిని ఏకాదశి నాడు విష్ణువుకు తులసి ఆకులు సమర్పించాలి. ఈ రోజుల తులసి ఆకులు సమర్పించడం వల్ల ఆ వ్యక్తికి సుఖ సంతోషాలు లభిస్తాయి. చేపట్టే ప్రతి పనిలో అభివృద్ధి ఉంటుంది.
Also read: Solar Eclipse 2023: సూర్య గ్రహణం రోజు ఏర్పడుతున్న యుతి, ఈ రాశులకు అన్నీ ఎదురుదెబ్బలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook