Amarnath yatra: అమర్‌నాథ్ యాత్రకు బుకింగ్ ఎలా ? వయస్సు, కావల్సిన డాక్యుమెంట్లు
Amarnath yatra: అమర్‌నాథ్ యాత్ర చేయాలనుకుంటున్నారా..అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. హిమాలయ శిఖరాల్లో పరిమిత రోజుల యాత్రకు త్వరపడండి మరి. ఎలా బుక్ చేసుకోవాలంటే..
Amarnath yatra: అమర్‌నాథ్ యాత్ర చేయాలనుకుంటున్నారా..అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. హిమాలయ శిఖరాల్లో పరిమిత రోజుల యాత్రకు త్వరపడండి మరి. ఎలా బుక్ చేసుకోవాలంటే..
ప్రతియేటా అమర్‌నాథ్ యాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రతియేటా 43 రోజులపాటు హిమాలయ శిఖర దారుల వెంట సాగే ఈ పవిత్ర యాత్ర ఆగస్టు 11న ముగుస్తుంది. ఆ రోజున ఆలయం మూసివేస్తారు. జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా అమర్‌నాథ్ యాత్ర జరగలేదు. హిమాలయాల్లోని పవిత్ర ప్రాంతాన్ని సందర్శించే 43 రోజుల యాత్రకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఈసారి తొలిసారిగా శ్రీనగర్ నుంచి పంచతరని వరకూ పాసెంజర్ల కోసం హెలికాప్టర్ సేవలు అందుబాటులో తీసుకొచ్చారు. పంచతరని నుంచి అమర్‌నాధ్ గుహకు 6 కిలోమీటర్లు మాత్రం నడిచి వెళ్లాల్సిందే. ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్రకు బుకింగ్స్ జరుగుతున్నాయి.
ముందుగా https://jksasb.nic.in/register.aspx వెబ్‌సైట్ ఓపెన్ చేసి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. పాసెంజర్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఎగ్రీ బటన్ క్లిక్ చేసినప్పుడు డౌన్‌లోడ్ అనుమతి కోరుతుంది. పేమెంట్ అంతా ఆన్‌లైన్‌లో ఉంటుంది. వెబ్‌సైట్ కాకుండా అమర్‌నాథ్ యాత్ర యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని బుకింగ్ చేసుకోవచ్చు.
అమర్‌నాథ్ యాత్రకు కావల్సిన పత్రాలు
2022, మార్చ్ నాటికి డాక్టర్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ అవసరమౌతుంది. నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు కాపీ అవసరం. అమర్‌నాధ్ యాత్రకు వెళ్లాలంటే వయసు ఆంక్షలున్నాయి. 13 ఏళ్లలోపు..75 ఏళ్ల పైబడి వయస్సున్నవారికి అమర్‌నాధ్ యాత్రకు అనుమతి లేదు. 6 వారాల గర్భిణీ స్త్రీలకు కూడా అమర్‌నాథ్ యాత్రపై నిషేధముంది.
Also read: Sun Transit Effect 2022: మిథునరాశిలో సూర్య సంచారం... జూన్ 18 నుంచి ఈ 5 రాశులవారు జాగ్రత్త..!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook