Amathyst Stone: రంగు రాళ్లు, రత్నాలకు జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత ఉంది. శనిదేవుడికి ఇష్టమైన నీలంలా కన్పించే పర్పుల్ రంగు రత్నంతో అద్భుత ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా సందర్బాల్లో జీవితంలో విచిత్ర పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుంది. జరిగే పనులు నిలిచిపోవడం, తరచూ నష్టాలు ఎదురు కావడం, అన్ని వైపుల్నించి నిరాశ ఎదురు కావడం ఇందులో ముఖ్యమైనవి. ఇలాంటి దురదృష్టాల్ని సైతం అదృష్టంగా మార్చుకునేందుకు ఓ అద్బుతమైన రత్నం ఉందంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇది పర్పుల్ రంగులో కన్పించే ఎమెధిస్ట్ స్టోన్. నీలం రత్నంలా కన్పిస్తుంది. ఈ రత్నం ధరిస్తే శని కటాక్షం ప్రాప్తిస్తుంది. జీవితం మారిపోతుంది. ఎమెథిస్ట్ స్టోన్ అనేది నీలంలా కన్పించినా అంత ఖరీదు కాకపోవడంతో అందరూ కొనుగోలు చేసుకోవచ్చు. ఇతర రత్నాల్లానే పండితుల సూచనల మేరకు ధరించాలి.


రత్నశాస్త్రం ప్రకారం ఎమెథిస్ట్ స్టోన్ ధరించడంతో ఆ వ్యక్తి పనిపై ఫోకస్ ఎక్కువ పెట్టగలడు. అతని చిత్తుశుద్ధి, అంకితభావం ధృఢంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఎదురయ్యే నష్టాల్నించి ఉపశమనం కలుగుతుంది. డబ్బు వచ్చే మార్గాలు పెరుగుతాయి., కెరీర్, ఉద్యోగంలో ఆటంకాలు దూరమౌతాయి. ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి కన్పిస్తుంది. నెగెటివ్ ఎనర్జీ దూరమౌతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. శనిదోషం కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సంబంధిత సమస్యలు దూరమౌతాయి.


ఎమెథిస్ట్ స్టోన్‌ను వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశులవాళ్లు పెట్టుకోవచ్చు. ఇంకా కుండలిలో శని అధమంగా ఉన్నప్పుడు కూడా ఈ స్టోన్ ధరించాలి. కానీ పండితుల సూచనల మేరకే పెట్టుకోవాలి. ఎమెథిస్ట్ స్టోన్ పెట్టుకోవాలంటే శనివారం చాలా అనువైన రోజు. ఉదయయం స్నానం చేసి శనిదేవుడిని ఆరాధించాలి. ఆ తరువాత ఎమెథిస్ట్ స్టోన్‌ను గంగాజలంతో శుభ్రం చేసి ధరించాలి. దాంతోపాటు శని మంత్రాన్ని జపించాలి. కుడిచేతి మధ్య వేలుకి ధరించాలి. 


Also read: Bhadrapad Amavasya 2022: భాద్రపద అమావాస్య ఎప్పుడు? శని, మహాదేవుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook