Bhadrapad Amavasya 2022: భాద్రపద అమావాస్య ఎప్పుడు? శని, మహాదేవుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి?

Bhadrapad Amavasya 2022: భాద్రపద అమావాస్య 27 ఆగస్టు 2022 శనివారం వస్తుంది. ఈ అమావాస్య నాడు శివయోగం ఏర్పడుతుంది. భాద్రపద అమావాస్య ముహూర్తం, పూజావిధానం గురించి తెలుసుకుందాం  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 21, 2022, 11:34 AM IST
Bhadrapad Amavasya 2022: భాద్రపద అమావాస్య ఎప్పుడు? శని, మహాదేవుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి?

Bhadrapad Amavasya 2022: భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను భాద్రపద అమావాస్య అంటారు. ఈ అమావాస్య మరో ఆరు రోజుల్లో అంటే 27 ఆగస్టు 2022, శనివారం నాడు వస్తుంది. ఇది శనివారం వస్తుంది కాబట్టి దీనిని శని అమావాస్య లేదా శనిశ్చరి అమావాస్య అని కూడా అంటారు. అంతేకాకుండా దీనిని పితోరి అమావాస్య, కుశ గ్రహణి అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున స్నానం, దానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజున తర్పణం, శ్రాద్ధం, పిండ ప్రదానం చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. తద్వారా వారు మీపై వరాల జల్లు కురిపిస్తారు. ఈ రోజున ప్రత్యేకమైన యోగం ఏర్పడుతుంది. భాద్రపద అమావాస్య ముహూర్తం, పూజావిధానం తెలుసుకుందాం

భాద్రపద అమావాస్య శుభ ముహూర్తం
భాద్రపద మాసం అమావాస్య తిథి 26 ఆగస్టు 2022 మధ్యాహ్నం 12.23 నుండి ప్రారంభమై..  శనివారం, ఆగస్టు 27, 2022 మధ్యాహ్నం 1:46 గంటలకు ముగుస్తుంది.
శివయోగం- ఆగస్టు 27 తెల్లవారుజామున 02.12 నుండి 28 ఆగస్టు 02.07 వరకు
అభిజీత్ ముహూర్తం - ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. 

ఈ పరిహారాలు చేయండి 
>> ఈసారి భాద్రపద అమావాస్య నాడు శనివారం రావడం, అదే రోజు శివయోగం కూడా ఏర్పడటంతో.. శివుడు, శనిదేవుడు అనుగ్రహం మీపై ఉంటుంది. 
>>  అమావాస్య నాడు శివయోగంలో శివాలయంలో మహాదేవుడికి జలాభిషేకం చేసి...పేదలకు దానధర్మాలు చేస్తే మీరు కష్టాల నుండి విముక్తి పొందుతారు. 
>>  భాద్రపద అమావాస్య శనివారం వస్తుంది. కాబట్టి ఈ రోజున రావిచెట్టుకు నీరు పోయండి. దీంతో శనిదేవుడు, పిత్ర దేవతలు ఆశీస్సులు లభిస్తాయి. 
>>  ఈ రోజున మతపరమైన పనుల కోసం కుశలను సేకరించే సంప్రదాయం ఉంది. అందుకే దీనిని కుశగ్రహణి అమావాస్య అని కూడా పిలుస్తారు.
>>  ఈ అమావాస్య రోజున గోవులకు మేత పెట్టడం ద్వారా మీ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. దీంతో పితృ దోషం తొలగిపోతుంది.

Also Read: Budh Gochar 2022:బుధుడు కన్యా రాశి ప్రవేశం, కొన్ని గంటల్లో మారనున్న ఈ రాశుల అదృష్టం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News