Amavasya 2024: 2024 మొదటి పుష్యమి అమావాస్య తేది..శుభ సమయాలు, చేయాల్సిన, చేయకూడని పనులు..
Amavasya 2024 Timings: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 11న మొదటి అమావాస్య రాబోతోంది. ఈ అమావాస్యను పుష్యమి అమావాస్య కూడా అంటారు. ఈరోజు నది స్నానం చేసి పూర్వీకులను పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
Amavasya 2024 Timings: హిందూ సాంప్రదాయంలో అమావాస్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. హిందువులంతా ఈరోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు కూడా పాటిస్తారు ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరుతుందని పూర్వీకుల నమ్మకం. దీంతోపాటు అమావాస్య రోజున ప్రత్యేకథితుల్లో పుణ్య నదులు స్నానాన్ని ఆచరించడం కూడా ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. నది స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి పూర్వీకుల ఆత్మ శాంతి కోసం వారికి నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే ఈ సంవత్సరం మొదటి అమావాస్య జనవరి 11వ తేదీన వచ్చింది. భారతీయులు ఈ అమావాస్యని పుష్య అమావాస్యగా కూడా పిలుస్తారు. దీనికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాముఖ్యత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పుష్యమి అమావాస్య శుభ సమయాలు:
శుభ సమయం:
కృష్ణ అమావాస్య జనవరి 10 రాత్రి 8 గంటల 10 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది.
పుష్యమి అమావాస్య జనవరి 11 సాయంత్రం 5 గంటల 26 నిమిషాలకు ముగుస్తుంది.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
పుష్యమి అమావాస్య పూజా విధానం:
పుష్యమి అమావాస్య రోజు శ్రీమహావిష్ణువుని పూజించాలి అనుకునేవారు తప్పకుండా భక్తిశ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఉదయాన్నే శుభ సమయాల్లో నిద్రలేచి పుణ్య నదుల్లో స్నానాన్ని ఆచరించాల్సి ఉంటుంది.
ఇలా స్నానాన్ని ఆచరించిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.
ఆ తర్వాత ఇంటికి చేరుకొని ఇంట్లో పట్టు వస్త్రాలను ధరించి చనిపోయిన పూర్వీకుల ఫోటోలకు పూలదండలు సమర్పించాలి.
ఆ తర్వాత వారికి నైవేద్యాన్ని సమర్పించి ఈరోజు దానధర్మ కార్యక్రమాలు చేయడం చాలా శుభప్రదం.
ఇంట్లో ఉన్న శ్రీమహావిష్ణువు ఫోటోకి పూలమాలను సమర్పించి స్తోత్రాన్ని చదువుతూ ధ్యానం చేయాల్సి ఉంటుంది.
ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు కలగడమే కాకుండా కోరుకున్న కోరికల నెరవేరుతాయి.
పుష్యమి అమావాస్య ప్రాముఖ్యత:
పుష్యమి అమావాస్యకి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ అమావాస్య రోజు పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించడం వల్ల వారి అనుగ్రహం లభించి జీవితంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
అంతేకాకుండా ఈరోజు నదీ స్నానాన్ని ఆచరించి అర్ఘ్యం సమర్పించడం వల్ల జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter