Anant Chaturdashi 2022: అనంతుడిని మీ రాశి ప్రకారం పూజిస్తే... అంతులేని ధనం మీ సొంతం!
Anant Chaturdashi 2022: అనంత చతుర్దశి రోజున అనంతుడి అనుగ్రహాన్ని పొందడానికి మీ రాశిచక్రం ప్రకారం ఈ పరిహారాలు చేయండి. దీంతో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంటుంది.
Anant Chaturdashi 2022 Puja Vidhanam: భాద్రపద శుక్ల పక్ష చతుర్దశి నాడు అనంత చతుర్దశిని జరుపుకుంటున్నారు. ఈ అనంత చతుర్దశి ఇవాళ అంటే సెప్టెంబరు 9న వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ రోజునే గణేశుడి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ పండుగ రోజున ముఖ్యంగా విష్ణుమూర్తిని పూజిస్తారు. శ్రీహరి యెుక్క 12 పేర్లలో అనంత్ ఒకటి. ఇవాళ ఉపవాసం చేస్తూ...శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని మీ రాశిప్రకారం పూజించడం వల్ల ఆనందంతోపాటు అపారమైన సంపదను పొందుతారు. ఏరాశివారు ఎలా పూజించాలో తెలుసుకుందాం.
మేషరాశి (Aries): ఇవాళ శ్రీహరిని పూజించేటప్పుడు ఆరాధనలో పసుపు రంగు వస్త్రాన్ని ఉంచండి. ఆ సమయంలో 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. పూజానంతరం మీరు డబ్బు ఉంచే స్థలంలో ఈ వస్త్రాన్ని ఉంచితే ధనం పెరుగుతుంది.
వృషభం (Taurus): అనంతుడిని ఆరాధించేటప్పుడు సువాసనమైన పువ్వులు సమర్పించి, 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని జపించండి. దీనితో పాటు పచ్చి అరటిపండు నైవేద్యంగా పెట్టాలి. దీంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మిధునరాశి (Gemini): విష్ణువును పూజించేటప్పుడు 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని జపించండి.
కర్కాటకం (Cancer): అనంత చతుర్దశి నాడు ఉపవాసం ఉండండి. ఆరాధనలో 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని జపించండి. సాయంత్రం యోగ్యుడైన బ్రాహ్మణునికి దానం చేయండి.
సింహరాశి(Leo): అనంతుడిని పూజించే సమయంలో అరటిపండ్లను తీసుకొని వాటిపై వేర్వేరు మౌళిని చుట్టి స్వామికి సమర్పించండి. ఈ సమయంలో 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని జపించండి. తరువాత ఈ అరటిపండ్లను ఏదైనా ఆలయానికి ఇవ్వాలి.
కన్య (Virgo): శ్రీహరి పూజలో ఒక గిన్నెలో గోధుమలు నింపి దానిపై పసుపు ముద్దను ఉంచాలి. 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. పూజానంతరం గిన్నెతో పాటు ఏదైనా ఆలయానికి దానం చేయండి.
తులారాశి (Libra): అనంతుడి ఆరాధనలో 'ఓం అనంతాయ నమః' అని జపించేటప్పుడు పసుపు, కుంకుమ లేదా కుంకుమ రంగుతో కూడిన రక్షాసూత్రాన్ని కట్టుకోండి.
వృశ్చికరాశి (Scorpio): విష్ణుమూర్తిని పూజ చేసేటప్పుడు మీ చేతికి 14 ముడులతో కూడిన రక్షాదారాన్ని కట్టుకోండి. ఈ సమయంలో 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని జపించండి.
ధనుస్సు రాశి (Sagittarius): ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత నీళ్లతో నింపిన ఇత్తడి పాత్రను తీసుకుని అందులో దుర్వాను వేయాలి. తర్వాత కలశంపై పసుపుతో స్వస్తిక్ గుర్తును తయారు చేసి పూజించండి. పూజ సమయంలో 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని జపించండి. అనంతరం ఈ కలశాన్ని బ్రాహ్మణుడికి దానం చేయండి.
మకరరాశి (Capricorn): విష్ణుమూర్తికి పసుపు పుష్పాలను సమర్పించండి. 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
కుంభ రాశి (Aquarius): కొబ్బరికాయపై తిలకం దిద్ది విష్ణువుకు సమర్పించండి. 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అప్పుడు ఈ కొబ్బరికాయను మీ పిల్లలకు ఇవ్వండి, లేకపోతే భద్రంగా ఉంచండి.
మీనరాశి (Pisces): విష్ణువు ముందు నెయ్యి దీపం వెలిగించి, పద్ధతి ప్రకారం పూజించండి. 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని జపించండి.
Also Read: Ganesh Nimajjanam Rules: గణేశ్ నిమజ్జనం ఎప్పుడు , ముహూర్త సమయమేది, చేయకూడని పనులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook