Kala Sarpa Dosha: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో గ్రహాలు నిర్దిష్ట స్థితిలో ఉన్నప్పుడు కాల సర్ప యోగం ఏర్పడుతుంది. ఇది చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. జాతకంలో కాలసర్ప దోషం ఉంటే మనిషి జీవితంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వ్యక్తి జీవితం పోరాటాలతో నిండి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహువు, కేతువులను హిందూమతంలో నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి. రాహు, కేతువుల మధ్య గ్రహాలన్నీ వచ్చినప్పుడు ఒక యోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని జాతకంలో కాలసర్ప దోషం అంటారు.


కాలసర్ప దోషం లక్షణాలు.. ప్రభావాలను తెలుసుకోండి..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో కాలసర్ప దోషం ఉంటే వారు జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి వారి జీవితం ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలతో నిండి ఉంటుంది. కాల సర్ప దోషం ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. తరచుగా అనారోగ్యానికి గురవుతారు. ఒక వ్యాధి నయమైతే, మరో వ్యాధి మొదలవుతుంది.


ఇదీ చదవండి: Love marriage: ఈ 4 రాశులవారే ఎక్కువశాతం ప్రేమవివాహాలు చేసుకుంటారట..!


కాల సర్ప దోషం ఉన్న వ్యక్తి ఉద్యోగ, వ్యాపారాల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటారని నమ్ముతారు. అంతేకాదు జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారి వైవాహిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. జీవితం ఒత్తిడితో కూడుకున్నది. పిల్లలు వారి జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారని నమ్ముతారు.


కాలసర్ప దోష పరిహారాలు..
కాలసర్ప దోషం ప్రభావాలను తగ్గించడానికి జ్యోతిషశాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయి. కాలసర్ప దోషం ప్రభావాలు గణనీయంగా తగ్గుతాయని నమ్ముతారు. కాల సర్ప దోషం ఉన్న వ్యక్తి నెమలి ఈకలను తన ఇంట్లోనే కాకుండా తన దగ్గర కూడా ఉంచుకోవాలి. ప్రవహించే నదిలో వెండి పాములను వదలాలి.


హనుమంతుడిని పూజించడం వల్ల కాలసర్ప దోషం తగ్గుతుంది. హనుమాన్ చాలీసా ప్రతిరోజూ 11 సార్లు చదవాలి. 


ఇదీ చదవండి: Money Vastu Tips: మీరు ధనవంతులు కావాలంటే ఈరోజే ఈ గవ్వలు ఇంటికి తెచ్చుకోండి..!


కాల సర్పదోషం పోగొట్టుకోవడానికి శివుని ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి శివుడిని పూజించండి. ప్రతిరోజూ గుడి లేదా ఇంట్లో శివలింగానికి పాలు సమర్పించి అభిషేకం చేయండి.


మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook