Money Vastu Tips: మీరు ధనవంతులు కావాలంటే ఈరోజే ఈ గవ్వలు ఇంటికి తెచ్చుకోండి..!

Money Vastu Tips: లక్ష్మీదేవిని సంపదల దేవతగా పిలుస్తారు. కానీ, ఆమె చంచలమైంది. ఎప్పుడూ ఒకే చోట ఉండదు. అందుకే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆమెకు సంబంధించిన కొన్ని వస్తువులను ఉంచడం శ్రేయస్కరం. 

Written by - Renuka Godugu | Last Updated : Feb 9, 2024, 11:23 AM IST
Money Vastu Tips: మీరు ధనవంతులు కావాలంటే ఈరోజే ఈ గవ్వలు ఇంటికి తెచ్చుకోండి..!

Money Vastu Tips: లక్ష్మీదేవిని సంపదల దేవతగా పిలుస్తారు. కానీ, ఆమె చంచలమైంది. ఎప్పుడూ ఒకే చోట ఉండదు. అందుకే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆమెకు సంబంధించిన కొన్ని వస్తువులను ఉంచడం శ్రేయస్కరం. 

సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి పుట్టిందని, అలాగే సముద్రం నుండి గవ్వలు కూడా బయటకు వస్తాయని అందుకే లక్ష్మీదేవికి ఇవి చాలా ప్రీతికరమైనవని చెబుతారు. ప్రత్యేకంగా పసుపు గవ్వలను ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీ దేవి త్వరగా ప్రసన్నం అవుతుంది.

ఇదీ చదవండి: వాలెంటైన్స్ డే రోజు పొరపాటున ఈ గిఫ్ట్‌ ఇచ్చారో మీరు బ్రేకప్ చెప్పుకోవల్సిందేనట..!
1. ఇంట్లో గవ్వలు ఉంచడం చాలా శ్రేయస్కరం. ఆ ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి. గవ్వలు తనవైపు డబ్బును ఆకర్షిస్తాయి. 

2. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజ సమయంలో గవ్వలు తప్పనిసరిగా ఉపయోగించాలి. లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు కచ్చితంగా గవ్వలను సమర్పించండి. దీంతో లక్ష్మీదేవి సంతోషించి ఇంటికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం ఇస్తుంది. 

3. 9 గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది, ఖజానా ఎప్పటికీ ఖాళీగా ఉండదు.

4.శుక్రవారం రోజున 11 గవ్వలను తీసుకుని పసుపు గుడ్డలో కట్టి ఇంటికి ఉత్తరం వైపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు నిల్వలు ఉంటాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది.

ఇదీ చదవండి:  తులసి మొక్కకు రోజూ ఈ వస్తువును సమర్పిస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు దరిచేరవు!

5. ఇంటి ప్రధాన ద్వారం వద్ద గవ్వలను వేలాడదీయడం కూడా శుభప్రదం. వీటిని ఎర్రటి గుడ్డలో 7-7 జంటలుగా కట్టి తలుపు బయట వేలాడదీయవచ్చు. ఇది ఇంట్లో సానుకూలతను తెస్తుంది. ఆర్థిక సంక్షోభం ఉండదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News