Lord Shiva Photo Vastu: మహాశివరాత్రి సమీపిస్తోంది. ఇంటిని శుభ్రం చేసుకుని పూజా పురస్కారాలు చేస్తారు. అయితే, వాస్తు ప్రకారం శివపార్వతులు వారి కుటుంబ సమేతంగా ఉన్న చిత్రపఠాలను ఏ దిక్కున పెట్టుకోవాలి? మీకు తెలుసా? శివుడు ఒక్కడు ఉండే చిత్రపఠం లేదా తన కుటుంబ సమేతంగా ఉండే చిత్రపఠాలు ఇంట్లో పెట్టుకోవడానికి ప్రత్యేక వాస్తు నియమాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తు శాస్త్రం ప్రకారం నియమాలు పాటించడం వల్ల ఇంట్లో నెగిటివిటీ తగ్గి పాజిటివిటీ పెరుగుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ఇల్లు కూడా అందుకే వాస్తు ప్రకారం నిర్మించుకుంటారు. అయితే, ఇంట్లో ఉండే వస్తువులు కూడా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతారు.


లేకపోతే వాటి వల్ల సానుకూల శక్తికి బదులుగా నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇదే ఇంట్లో ఏర్పాటు చేసుకుకే విగ్రహాలు, దేవుని చిత్రపఠాల్లో కూడా జరుగుతుంది. సాధారణంగా మనమందరం ఇళ్లలో శివపార్వతులు, గణేశ, కార్తికేయులు ఉండే చిత్రపఠం ఏర్పాటు చేసుకుంటాం. శివుడికి వాహనం నంది, వినాయకుడికి వాహనం ఎలుక, అదేవిధంగా కార్తికేయుని వాహనం నెమలి అంటారు. హిందూమతంలో వీరంతా కలిసి ఉండే చిత్రపఠాలను ఇంట్లో పెట్టుకుంటే మంచిదని నమ్ముతారు. వినాయకుడు ఆదిదేవుడుగా పూజిస్తారు.


సాధారణంగా ఏ దేవుడి ఫోటోలైనా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటారు. అయితే, శివపార్వతుల చిత్రాలు మాత్రమే కాదు, వాస్తు ప్రకారం ఏ దేవుడి చిత్రపఠాలనైనా ఇంటి బాత్రూమ్ గోడకు పెట్టకూడదు. ఇది నెగిటివ్ ఎనర్జీని తెస్తుంది.


ఇదీ చదవండి: శనివారం ఈ ఒక్కపనిచేస్తే రాత్రికి రాత్రే ధనవంతులౌతారు.. జ్యోతిష్యుల సూచనలివే..
వాస్తు ప్రకారం శివపార్వతుల చిత్ర పఠాలను తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండే గోడకు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఉత్తరం కుబేర దిశ పైగా శివయ్య కూడా ఉత్తరం వైపుగా ఉండే కైలాసంపై కూర్చొని ఉంటాడు అని నమ్ముతారు. అందుకే ఈ దిశలోనే శివపార్వతుల చిత్రపఠాలను పెట్టుకోవాలి.



అయితే, వాస్తు ప్రకారం ఏ దేవుడి చిత్రపఠాలైనా కూర్చొని ఉన్న ఫోటోలను ఇంట్లో పెట్టుకోవాలి. ఈ చిత్రపఠాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక శ్రేయస్సు, మీ ఇంటికి ఆనందం చేకూరుతుంది. ముఖ్యంగా పూజా మందిరంలో ఏ దేవుడి చిత్రపఠమైనా ఉగ్రరూపంలో ఉండకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఇది నెగిటివిటీకి దారితీస్తుంది. అలాగే శివపార్వతుల  చిత్రపఠం కూడా ఉగ్రరూపంలో కాకుండా ప్రశాంతంగా ఉన్న ఫోటోలను పెట్టుకోవాలి.


ఇదీ చదవండి: మార్చి నెలలో ధనవంతులు కాబోతున్న రాశులు ఇవే.. మీ రాశి ఉందా?


అంతేకాదు పూజగదిలో సరైన వెలుగు ఉండేలా చూసుకోండి. ఇది ఇంటి పాజిటివిటీని పెంచుతుంది. ఏ చిత్రపఠాలు లేదా విగ్రహాలైనా పగలకుండా, పాడవ్వనివి మాత్రమే పెట్టుకోండి. హిందూమతంలో శివపూజకు సోమవారం ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. ఇక వినాయకుడికి బుధవారం, కార్తికేయుడికి మంగళవారం ప్రత్యేకంగా భావిస్తారు. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter