Karwa Chauth 2023: మహిళలు ముఖ్యంగా ఉత్తరాదిన అత్యంత ఘనంగా జరుపుకునే కర్వాచౌత్ ఇవాళే. నవంబర్ 1 కర్వాచౌత్‌కు విశేష ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈసారి కర్వాచౌత్ రోజున అరుదైన యోగాలు ఏర్పడనుండటం ఇందుకు కారణం. అందుకే 5 రాశులకు మహర్దశ పట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూవులు అత్యంత పవిత్రంగా భావించే కర్వాచౌత్ ఇవాళ నవంబర్ 1న దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. జ్యోతిష్యం ప్రకారం అత్యంత మహత్యం కలిగినవిగా భావించే బుధాదిత్య యోగం, ఆదిత్య యోగం, శివ యోగం, స్వార్ధ సిద్ధి యోగాల అరుదైన సంయోగం ఏర్పడనుంది. అందుకే ఈ యోగాల ప్రభావం అన్ని రాశుల జీవితాలపై స్పష్టంగా ఉంటుంది. కర్వాచౌత్ అంటే మహిళలకు సంబంధించింది. ఈసారి కర్వాచౌత్ రోజున వివిధ యోగాల సంయోగం ఉండటంతో మహత్యం మరింతగా పెరిగింది. ఫలితంగా 5 రాశులకు ఊహించని ధనలాభం కలగనుంది. 


కర్వా చౌత్ వేడుక మకర రాశి జాతకులకు ఊహించని ధనలాభం కలగనుంది. మహిళలకు పుట్టింటి నుంచి శుభవార్త అందుతుంది. ఇది ఆస్థికి సంబంధించిందిగా భావిస్తున్నారు. ఈ సమయంలో బంధాలు పటిష్టమౌతాయి. ఇంటా బయటా అంతటా సానుకూల పరిణామాలే ఎదురౌతుంటాయి. ఇంటికి అతిధులు వచ్చే అవకాశముంది. ఉద్యోగులకు పదోన్నతి , ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వ్యాపారులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. 


కర్వా చౌత్ సందర్భంగా కుంభ రాశి జాతకులకు చాలా అనువైన వాతావరణం ఉంటుంది. అంటే ఎక్కకికి వెళ్లినా అన్ని పనులు సజావుగా కొనసాగిపోతాయి. ప్రభుత్వం వైపు నుంచి అనుకూల పరిస్థితులుంటాయి. ముఖ్యంగా ఇది ప్రభుత్వ కాంట్రాక్టులు చేసేవారికి ప్రయోజనకరం. పూర్వీకుల సంపదతో ఆర్ధికంగా లాభపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు అనువైన సమయం. అనుకున్నది కచ్చితంగా జరగవచ్చు. ఆరోగ్యపరంగా కాస్త అప్రమత్తంగా ఉండాలి. 


మిధున రాశి జాతకులకు ఇది చాలా మంచి సమయం. అన్ని విషయాల్లోనూ మీకు తిరుగుండదు. చేపట్టిన ప్రతి పని సక్సెస్ కాగలదు. కుటుంబజీవితంలో ఆనందం సంభవిస్తుంది. ఆత్మ విశ్వాసం పెరగడం వల్ల వివిధ రకాల సమస్యల్ని సమర్ధవంతంగా ఎదుర్కోగలరు. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వ్యాపారం విస్తృతం అయ్యే అవకాశాలున్నాయి. 


తుల రాశి జాతకులకు కర్వాచౌత్ అదృష్టం తెచ్చిపెట్టనుంది. ఎందుకంటే వివిధ యోగాల అద్భుతమైన సంయోగం కూడా ఇవాళే జరగనుంది. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు ఎదురుకాకపోవచ్చు. అంతా సాపీగా సాగిపోతుంటుంది. ప్రత్యేకించి వ్యాపారులకు చాలా అనువైన సమయం. జీవిత భాగస్వామి నుంచి లాభాలు రావచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు అమితమైన ధనలాభం కలగనుంది. 


కన్యా రాశి జాతకులకు కర్వా చౌత్ విశేష లాభాలు తెచ్చిపెట్టనుంది. ఉన్నత స్థితికి చేరుకోవడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. వ్యాపార వర్గాలకు ఊహించని లాభముంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభించనున్నాయి. ఇక వ్యాపారులకైతే అమితమైన లాభాలుంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. అన్ని రంగాల్లోనూ ఈ జాతకులకు అభివృద్ధి లభిస్తుంది. 


Also read: Karthika Masam 2023: కార్తీక మాసంలో ఈ 3 రాశులకు తిరుగేలేదు, పట్టిందల్లా బంగారమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook