Astro Hints: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి నెలా ఏదో ఒక గ్రహం వక్రమార్గం లేదా గోచారం సంభవిస్తుంటుంది. ఆ ప్రభావం మిగిలిన రాశులపై పడుతుంటుంది. జూన్ 18వ తేదీ నుంచి శుక్రగ్రహం వృషభరాశిలో ప్రవేశించనున్న సందర్బంగా..కొన్ని రాశులవారు సంపదతో తులతూగుతారట..ఆ వివరాలు చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రగ్రహం భౌతిక సుఖం, ధనం, ఐశ్వర్యాలకు కారకమైంది. జూన్ 18వ తేదీన అంటే రేపట్నించి శుక్రగ్రహం తన వృషభరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ నేపధ్యంలో శుక్రుడి గోచారం ప్రభావం వ్యక్తి  జీవితంపై స్పష్టంగా కన్పిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం ఎవరి కుండలిలో శుక్రుడు బలంగా ఉంటాడో..వారి జీవితం ధన ధాన్యాలతో నిండి ఉంటుంది. దాంతోపాటు వీరి వ్యక్తిత్వం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శుక్రగ్రహం గోచారం ఫలితం ఏయే రాశులపై ఉంటుందో తెలుసుకుందాం..


మేషరాశి జాతకులకు శుక్రుని గోచారం చాలా లాభదాయకంగా ఉండనుంది. జూలై 13 వరకూ ఇంట్లో ఆనందపు వాతావరణం ఉంటుంది. దాంతోపాటు ఈ సమయం వ్యాపారానికి అనువైన సమయం. ఉద్యోగస్థులు శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఎదైనా పెద్ద డీల్ పైనల్ కావచ్చు.


సింహరాశి జాతకులకు పనిచేసేచోట లాభాలు కలుగుతాయి. ఈ సందర్భంగా ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. కెరీర్‌లో లాభాలుంటాయి. చాలామంచి అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మీ కష్టానికి పూర్తి ఫలితం లభిస్తుంది. దాంతోపాటు అదృష్టం తోడవుతుంది. 


కర్కాటక రాశి జాతకులకు ఆదాయంలో వృద్ది లభిస్తుంది. ఉద్యోగంలో ఉదోన్నతి అవకాశాలున్నాయి. చాలాకాలం నుంచి నిలిచిపోయిన డబ్బులు తిరిగొస్తాయి. ఆర్ధికంగా ఈ గోచారం ప్రభావం బాగుంటుంది. వేర్వేరు మార్గాల్నించి డబ్బులు సంపాదించడంలో సఫలీకృతులవుతారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. 


మీనరాశి జాతకులకు లాభాలు చాలా ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి యోగం ఉంది. పనిచేసేచోట విజయం లభిస్తుంది. కష్టపడినదానికి సంపూర్ణ లాభం కలుగుతుంది. ఈ సందర్భంగా చిన్న చిన్న ప్రయాణాలు చేయవచ్చు. అయితే ధనలాభం ఉంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంటుంది. 


Also read: Astro tips for pooja: పూజ వస్తువులు నేలపై ఉంచితే ఏమవుతుంది, రోడ్డున పడిపోతారా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook