Astro Remedies: నాలుగు డబ్బులు సంపాదించేందుకు ప్రతి ఒక్కరూ రేయింబవళ్లూ శ్రమిస్తుంటారు. కానీ పరిస్థితి మెరుగుపడదు ఒక్కోసారి. ఈ నేపధ్యంలో ఒక రూపాయి నాణెంతో జీవితమే మారిపోతుందంటున్నారు జ్యోతిష్య పండితులు. అదెలాగో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుటుంబంలో సుఖ శాంతులు వర్ధిల్లాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే. ఎవరికీ రాత్రికి రాత్రి సంపద వచ్చి చేరదు. కష్టపడితేనే ఫలితమంటుంది. అప్పుడే కుటుంబ సభ్యులు సంతోషంగా జీవితం గడపగలుగుతారు.కొన్ని సార్లు అదృష్టం కలిసిరాకపోతే..ఎంతగా కష్టపడినా ఫలితముండదు. ధననష్టం, ఆర్ధిక పరమైన సమస్యలు వెంటాడుతుంటాయి. నెమ్మది నెమ్మదిగా అప్పులపాలవుతాడు. ఈ సమస్యల్ని గట్టెక్కేందుకు దేవుడిని ఆశ్రయించడం, ఉపాయాలు అణ్వేషించడం సహజం. అసలిలా ఎందుకు జరుగుతుందో ఆలోచించాలి ముందుగా.


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం డబ్బు సమస్య, ఆర్ధికపరమైన ఇబ్బందులు వెంటాడినప్పుడు ఇంట్లో వాస్తుదోషం, గ్రహదోషం కారణం కావచ్చు. ఈ దోషాల్ని దూరం చేసేందుకు కొన్ని సులభమైన పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ పద్ధతులు ఆచరించడం కూడా చాలా సులువు. రూపాయి నాణెంతో జీవితంలో ఆర్ధిక ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చంటున్నారు వాస్తు పండితులు.


రూపాయి నాణెంతో మారనున్న అదృష్టం


ఎంతగా కష్టపడినా కెరీర్‌లో సక్సెస్ లభించకపోయినా లేదా మంచి అవకాశాలు రాకపోయినా..రూపాయి నాణెం మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మీ పర్సులో లేదా జేబులో రూపాయి నాణెం, నెమలి ఈక ఉంచాలంటున్నారు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు దూరమౌతాయి. కష్టపడినదానికి ఫలితముంటుంది. జ్యోతిష్యం ప్రకారం  ఇంట్లో డబ్బుల సమస్య వల్ల కుటుంబంలో సమస్యలు ఉత్పన్నమైనా..లేదా నష్టాల్లో కూరుకుపోతున్నా బియ్యం, రూపాయి నాణెంతో సమస్యలు దూరం చేసుకోవచ్చు. గుప్పెడు బియ్యం, రూపాయి నాణెంతో గుడికి వెళ్లి ప్రార్ధించాలి. ఓ మూలన ఆ బియ్యం, నాణెం ఉంచాలి. పూజల తరువాత ఆ బియ్యం, రూపాయి నాణెం దానం చేయాలి. 


ఎవరికైనా డబ్బుల్లేక ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటే..ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా..నిర్ణీత పద్ధతిలో సాయంత్రం వేళ ఇంటి ముఖద్వారం పై చతుర్ముఖ దీపాన్ని నెయ్యితో వెలిగించాలి. ఇది మంచి ఫలితాలనిస్తుంది. ఈ దీపంలో రూపాయి నాణెం వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ శక్తులు దూరమౌతాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసముంటుందని నమ్మకం. 


Also read: Horoscope Today July 6th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు అనుకున్న పూర్తి చేయగలుగుతారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook