Astro Remedies: ఎంత కష్టపడినా డబ్బులు సంపాదించలేకపోతున్నారా..విఫలమౌతున్నారా..అయితే మీ కుండలిలో లోపమున్నట్టే. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే విషయంపై జ్యోతిష్యులు ఏం చెబుతున్నారో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొంతమంది డబ్బులు సంపాధించాలని ఎంత ప్రయత్నించినా విఫలమౌతుంటారు లేదా డబ్బుులు పొదుపు చేయలేకపోతుంటారు. తరచూ నష్టాలు ఎదుర్కొంటుంటారు. ఈ పరిస్థితుల్నించి బయటపడేందుకు జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని ఉపాయాలున్నాయి. గ్రహబలం లేకపోవడం, వాస్తు దోషం వంటి కారణాలు కావచ్చు. జీవితంలో వరుసగా నష్టాలు ఎదురవుతున్నప్పుడు చాలా నిరాశ ఎదురవుతుంటుంది. వీటి నుంచి బయటపడేందుకు ఏం ఉపాయాలున్నాయి, ఏం చేయాలనేది ఆలోచించాలి. జ్యోతిష్యశాస్త్రంలో అందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి కూడా. అవేంటో తెలుసుకుందాం.


ఒకవేళ మీరు ఆర్ధిక ఇబ్బందుల్లోంచి బయటపడలేకపోతుంటే..శుక్రవారం నాడు ఓ సులభమైన పని చేయాల్సి ఉంటుంది. ఇంట్లోని దేవుని గుడి గుమ్మంపై ఓ కలశంలో నీళ్లు నింపి పెట్టాలి. తరువాత కలశంపై కేసరి రంగు స్వస్తిక్ గుర్తు వేయాలి. ఆ నీళ్లలో రూపాయి నాణెం వేసి కలశం పూజ చేయాలి.


ఒకవేళ మీరు జీవితంలో పలు విధాలుగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే..గుప్పెడు బియ్యం, రూపాయి నాణెం తీసుకోవాలి. గుడికెళ్లి ఇబ్బందులు దూరం చేయాలని దేవుడిని ప్రార్ధించాలి. ఆ తరువాత రూపాయి నాణెంతో సహా ఆ బియ్యాన్ని ఆలయంలో ఏదో ఓ మూల ఉంచాలి. కొన్ని రోజుల్లోనే సమస్యల్నించి బయటపడతారు.


పేదరికంతో కొట్టుమిట్టాడుతుండి..ఆదాయం తగ్గిపోతుంటే ఏం చేయాలనేది జ్యోతిష్యులు సూచిస్తున్నారు. రోజూ సాయంత్రం ఇంట్లోని ప్రధాన గుమ్మంపై నాలుగు ముఖాల దీపం వెలిగించాలి. సాధ్యమైనంతవరకూ నెయ్యితో దీపం వెలిగించడం మంచిది. దాంతోపాటు దీపంలో రూపాయి కాయిన్ ఉంచాలి. దీనివల్ల ఇంటికుండే నెగెటివ్ ఎనర్జీ తొలగిపతుంది. లక్ష్మీదేవి ప్రసన్నమై..సంపదనిస్తుంది. 


ఒకవేళ జీవితంలో అవసరాలు తీరకపోయినా..సరే ఉపాయముంది. మీ జేబులో ఎల్లప్పుడూ రూపాయి కాయిన్, నెమలి పింఛాన్ని ఉంచుకోవాలి. దీనివల్ల కొత్త అవకాశాలు లభిస్తాయి.


Also read: Saturn Effect 2022: జూన్ 5 నుంచి వక్రమార్గంలో శని, ఏ రాశులపై దుష్ప్రభావం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.