June Month Horoscope 2023: జూన్ నెల ప్రారంభమైంది. ఈ నెలలో సూర్యుడు, బుధుడు, శని గ్రహాల గోచారం కారణంగా 4 రాశులకు అదృష్టం తిరగరాయనుంది. ఎంత అదృష్టవంతులంటే..వీరి జాతకం కూడా సూర్యుడిలానే మెరిసిపోతుంది. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతూ పోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా జూన్ 7వ తేదీన బుధుడు వృషభ రాశిలో గోచారం చేయనున్నాడు. ఆ తరువాత గ్రహాల రాజుగా భావించే సూర్యుడు జూన్ 15వ తేదీన మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. ఇక చివరిగా జూన్ 17వ తేదీన శని గ్రహం వక్రమార్గం పట్టనున్నాడు. అనంతరం జూన్ 19వ తేదీన తిరిగి బుధగ్రహం వృషభరాశిలోనే అస్తమించనున్నాడు. తిరిగి జూన్ 24వ తేదీన బుధుడు మిధున రాశిలో ప్రవేశిస్తాడు. అంటే ఈ మాడు శక్తివంతమైన గ్రహాల కదలిక జూన్ నెలలోనే ఉంటుంది. ఫలితంగా 4 రాశులవారికి చాలా అదృష్టం, శుభప్రదం కానుంది. ఈ జాతకం వ్యక్తులు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.


జ్యోతిష్యం ప్రకారం వృశ్చిక రాశి జాతకులకు జూన్ నెల ప్రారంభం నుంచే అంతా అనుకూలంగా ఉంటుంది. పెళ్లికానివారికి పెళ్లి సంబంధాలు నిశ్చయమౌతాయి. దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్ధులకు అంతా కలిసొస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అంతా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు కలిగితే ఉద్యోగులకు పదోన్నతి , ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 


Also Read: Sun transit 2023: జూన్ 15న మిథునరాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారం..


హిందూ పంచాంగం ప్రకారం కర్కాటక రాశి జాతకులకు ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది. విదేశీ యాత్రలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. జూన్ రెండవ పక్షంలో మీరు ఊహించని శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా మాత్రం చాలా సమస్యలు వేధిస్తాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు.


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ధనస్సు రాశి జాతకులకు జూన్ నెల ఊహించని లాభాలు ఆర్జిస్తుంది. జూన్ 15 తరువాత విదేశీ యాత్రలకు వెళ్లే కోరికలు నెరవేర్చుకుంటారు. ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి చాలా బాగుంటుంది. 


ఇక జూన్ నెల సింహ రాశి జాతకులకు ఊహించని రీతిలో కనకవర్షం కురిపిస్తుంది. భూమి, ఇళ్లు లేదా వాహనం కొనుగోలు కోరిక నెరవేరుతుంది. రాజకీయాల్లో ఉండేవారికి చాలా అనువైన సమయం. కీలకమైన పదవులు, బాధ్యతలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉండకపోవచ్చు. 


Also Read: Zodiac Signs: మీరు ఈ రాశులవారితో జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే భారీగా మోసపోతారు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook