Surya Gochar 2023 in Gemini: నెలకొకసారి సూర్యభగవానుడు తన రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. ప్రస్తుతం ఆదిత్యుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 15 సాయంత్రం 06.07 గంటలకు మిథునరాశిలో సంచరిస్తాడు. దీనినే మిథున సంక్రాంతి అని పిలుస్తారు. జూలై 30 వరకు భానుడు ఇదే రాశిలో సంచరిస్తాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
సింహరాశి
సూర్య సంచారం సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు కెరీర్ లో కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో రాణిస్తారు.
కన్య రాశి
ఆదిత్యుడి సంచారం వల్ల కన్యా రాశి వారు ఊహించని స్థాయికి వెళతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. మీకు పరిచయాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు ఎవరినీ నమ్మకండి.
మేషరాశి
భానుడు గోచారం మేషరాశి వారికి కలిసి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఆఫీసులో ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి
సూర్యభగవానుడి సంచారం కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది.
Also Read: Mercury transit 2023: మరో నాలుగు రోజుల్లో ఈ 3 రాశులకు అదృష్టం పట్టనుంది.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Sun transit 2023: జూన్ 15న మిథునరాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారం..