September for Gemini: ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో మారుతుంటుంది. దీనినే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తారు. గ్రహాల కదలికతో లేదా రాశి పరివర్తనంతో అన్ని రాశులపై ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులకు అనుకూలంగా, మరి కొన్నిరాశులకు ప్రతికూలంగా ఉండనుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ మనం మిధున రాశి జాతకులకు వచ్చే నెల సెప్టెంబర్ ఎలా ఉండనుందో తెలుసుకుందాం. మిధున రాశి జాతకులకు ఈ నెల కెరీర్‌పరంగా మంచి పరిణామాలు కలుగుతాయి. అయితే ఎక్కువ కష్టపడాల్సి వస్తుందంటారు. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. లేదా కొత్త ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇంకొంతమందైతే ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లవచ్చు. 


మిదున రాశి ఉద్యోగులకు ఈ నెల బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారులకు కూడా అనువైన సమయం. వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. పోటీని తట్టుకునేందుకు ఎప్పటికప్పుుడు డిస్కౌంట్ అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండాలి. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఆలోచిస్తుంటే ఇది సరైన సమయమే అవుతుంది. ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. ఊహించని ధనలాభంతో పాటు షేర్ మార్కెట్ నుంచి లాభాలు ఆర్జించవచ్చు. విదేశీ కంపెనీలతో వ్యాపారం చేసే అవకాశం కలుగుతుంది. వ్యాపార నిమత్తం దూర ప్రాంతాలకు వెళ్లవచ్చు.. మంచి ఆర్డర్లు లభిస్తాయి. 


కుుటంబ జీవితం మిధున రాశి జాతకులకు బాగుంటుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి మెలిసి ఉంటారు. ఇంట్లో సుఖమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ప్రభావంతో అందరిలో సంతోషం ఉంటుంది. కుటుంబంలో ఎప్పట్నించో ఉన్న వివాదాలు పరిష్కారమౌతాయి. 


ఇక మిదున రాశి యువకులకు అయితే కెరీర్ పరంగా మంచి అవకాశాలుంటాయి. మీ సామర్ద్యాన్ని , పని తనాన్ని ప్రదర్శించే అవకాశం లభించడమే కాకుండా కెరీర్ మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉండేవారికి ఎ సమస్యా రాదు. ఇరువురి మద్య బంధం గట్టిపడుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే యువతకు మంచి సమయం కావచ్చు.


Also read: Lucky Girls: ఆ తేదీన పుట్టే అమ్మాయిలు భర్తకే కాదు మొత్తం కుటుంబానికే అదృష్ట దేవతలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook