Lucky Girls: ఆ తేదీన పుట్టే అమ్మాయిలు భర్తకే కాదు మొత్తం కుటుంబానికే అదృష్ట దేవతలు

Lucky Girls: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి ప్రాముఖ్యత ఉన్నట్టే సంఖ్యా శాస్త్రానికి సైతం మహత్యం ఉంది. వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం అనేది సంఖ్యా శాస్త్రంతో తెలుస్తుందంటారు. వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వివరాలు తెలుస్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 26, 2023, 10:07 AM IST
Lucky Girls: ఆ తేదీన పుట్టే అమ్మాయిలు భర్తకే కాదు మొత్తం కుటుంబానికే అదృష్ట దేవతలు

Lucky Girls: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆ వ్యక్తి భవిష్యత్ అనేది నిర్ణయమౌతుంది. పుట్టిన తేదీని బట్టి ఆ వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం లేదా ఆ వ్యక్తి భవిష్యత్ ఎలా ఉంటుందనేది సంఖ్యా శాస్త్రం చెబుతోందంటారు. ప్రతి అంకెకు ఓ విశిష్టత ఉన్నట్టే..2వ తేదీన పుట్టిన అమ్మాయిలు ఎలా ఉంటారు, ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది ఇప్పుడు పరిశీలిద్దాం..

జీవితంలో అన్ని సుఖ సంతోషాలుండాలని, ధన సంపదలతో తులతూగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే దైనందిన జీవితంలో ఉద్యోగ, వ్యాపార రీత్యా కష్టపడుతుంటారు. కొంతమందికి అదృష్టం తోడై అన్నీ అనుకూలిస్తే మరి కొందరికి ఎంత కష్టపడినా అదృష్టం తోడులేక ప్రతికూల పరిస్థితులు ఎదురౌతుంటాయి. ఇంకొంతమందికి పెళ్లి తరువాత జీవితం మారిపోతుంటుంది. భాగస్వామిగా వచ్చేవారి అదృష్టం ఇద్దరి జీవితాలపై ప్రభావం చూపిస్తుందనేది సంఖ్యాశాస్త్రం లేదా జ్యోతిష్య శాస్త్రం చెప్పే మాట. 

సంఖ్యాశాస్త్రంలో కొన్ని తేదీలు సొంతంగా వారికి అనుకూలించకపోయినా..ఇతరులకు అదృష్టంగా మారతాయి. ఎవరైనా ఓ అమ్మాయి 2,11,20 తేదీల్లో పుడితే అంటే టోటల్ 2 నెంబర్‌లో పుడితే ఆ అమ్మాయిలు తమ భర్తకే కాకుండా మొత్తం కుటుంబానికే అదృష్ట దేవతలౌతారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. అంటే పెళ్లైన తరువాత ఈ అమ్మాయిలు తమ భర్త అదృష్టాన్ని మార్చేస్తారు. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే..

పుట్టిన తేదీని బట్టి గణన ఉంటుంది. ఎవరైనా అమ్మాయి 2, 11, 20 తేదీల్లో జన్మిస్తే ఆ అమ్మాయి పుట్టిన తేటీ టోటల్ 2 అవుతుంది. సంఖ్యా శాస్త్రంలో 2కు చాలా ప్రాధాన్యత ఉంది. 2ను లక్కీ నెంబర్‌గా పరిగణిస్తారు. అందుకే టోటల్ 2తో సంబంధముండే అమ్మాయిలు తమ భర్తకు అదృష్ట దేవతలౌతారు. ఇంకా సులభంగా చెప్పాలంటే తమ భర్తను రాజుగా మార్చవచ్చు ఆ అమ్మాయి అదృష్టం.

టోటల్ 2 ఉండే అమ్మాయిలు తమ భర్తను అమితంగా ప్రేమిస్తారని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. స్వభావ రీత్యా ఈ రోజున పుట్టే అమ్మాయిలు ఎమోషనల్ అట. అందుకే చాలా త్వరగా కుటుంబంతో లేదా భర్తతో బందమేర్పర్చుకుంటారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం టోటల్ 2 ఉండే అమ్మాయిలు చాలా ఆదర్శవంతులని తెలుస్తోంది. భర్తపై ప్రత్యేక కేర్ తీసుకుంటారు. ఇక కుటుంబపరంగా చూస్తే అత్తగారింట్లో మంచి కోడలిగా ముద్ర పడతారు. ప్రతి ఒక్కరితో మంచిగా మెలగడం ఈ అమ్మాయిలకు బాగా తెలుసు. ఆచరిస్తారు కూడా. ఈ అమ్మాయిలు స్వభావ రీత్యా ఎమోషనల్ కావడంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి చిన్న విషయానికి నొచ్చుకుంటుంటారు. 

Also read: Venus Retrograde 2023: శుక్రుడి తిరోగమనం ఎఫెక్ట్, ఈ మూడు రాశులకు సెప్టెంబర్ 4 వరకూ ఊహించని డబ్బులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News