జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రోజులో కొద్ది సమయం ఏవిధమైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం. ఎందుకంటే రాహుకాలాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఈ ముహూర్తంలో ఏ పని చేయడం కూడా మంచిది కాదు. రాహువును ఛాయాగ్రహంగా పిలుస్తారు. రోజు మొత్తంలో రాహుకాలముంటుంది. అందుకే రాహుకాలం ఎప్పుడనేది లెక్కిస్తుంటారు. రాహుకాలం ఏరోజుకారోజు మారుతుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహుకాలంలో చేసిన ఏ పనైనా సఫలం కానేకాదంటారు. లేదా ఆ వ్యక్తికి వివిధ రకాల సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందంటారు. అసలు మొత్తం రోజులో రాహుకాలం ఎప్పుడుంటుంది, రాహుకాలంలో ఏ పని చేయాలి, ఏది చేయకూడదనేది పరిశీలిద్దాం..


జ్యోతిష్యం ప్రకారం రాహుకాలానికి అధిపతి గ్రహం రాహువే. అశుభ ఫలాల్ని అందిస్తుంటాడు. ప్రతిరోజూ ఓ గంటన్నర రాహుకాలముంటుంది. జ్యోతిష్యుల ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో 8వ భాగం రాహుకాలంగా పరిగణిస్తారు. 


రాహుకాలం లెక్కింపు ఇలా


జ్యోతిష్యం ప్రకారం ప్రతిరోజూ రాహుకాలం వేర్వేరుగా ఉంటుంది. ప్రత్యేకించి మంగళవారం, శనివారం, ఆదివారం రోజుల్లో రాహుకాలాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజుల్లో పగలు రాహుకాలం సమయంలో రాహువు ప్రత్యేకంగా ప్రభావితుడై ఉంటాడు. సూర్యోదయం సమయం, స్థానం, రోజు ప్రకారం రాహుకాలాన్ని లెక్కిస్తారు. 


రాహుకాలంలో ఎవరూ కొత్త వ్యాపారం, కొత్త కార్యక్రమాలు లేదా కొత్త పనులు చేపట్టకూడదు. ఈ సమయంలో ఏదైనా కీలకమైన యాత్రలు చేపట్టకూడదు. వీలైతే వాయిదా వేయాలి. జ్యోతిష్యం ప్రకారం ఈ కాలంలో క్షవరం, ఉపనయనం, గృహప్రవేశం, వీడ్కోలు, పెళ్లి, నిశ్చితార్ధం వంటి శుభకార్యాలు చేయకూడదు. రాహుకాలంలో ఏ విధమైన కొత్త ఆస్థి, వాహనం, నగలు, వస్తువులు కొనకూడదు. యజ్ఞాలు కూడా ఈ సమయంలో చేయకూడదు.


రాహుకాలంలో చేయాల్సిన ఉపాయాలు


జ్యోతిష్యం ప్రకారం ఏదైనా పని తప్పకుండా చేయాల్సి వస్తే ముందుగా హనుమంతుడిని పూజించాలి. హనుమాన్ చాలీసా పఠించి ఆ తరువాత పని పూర్తి చేసిన ప్రసాదం స్వీకరించాలి.  ఈ సమయంలో యాత్ర చేయాల్సి వస్తే..ఇంటి ప్రధాన గుమ్మం నుంచి బయలుదేరేముందు పది అడుగులు వెనక్కి వేయాలి. ఆ తరువాత బయటకు రావాలి. రాహుకాలంలో యాత్ర చేయడానికి ముందు పెరుగు, పాన్, లేదా కొద్దిగా స్వీట్ తీసుకుని బయలుదేరాలి. ఇలా చేయడం వల్ల అశుభ ప్రభావం తగ్గుతుంది. 


రాహుకాలంలో శివుడి పూజ


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహుకాలంలో ఏ పనీ చేయకూడదు. రాహుకాలంలో శివుడిని పూజిస్తే..కాలసర్పదోషం తొలగిపోతుంది. కాలసర్పదోషం విముక్తికి రాహుకాలంలో శివుడిని పూజించాలి.


Also read: Sun Blessing Remedies: ఆ రెండు రాశులపై సదా సూర్యుడి కటాక్షం, రథ సప్తమిన చేయాల్సిన ఉపాయాలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook