Astrology Unauspicious Things: మనం పూజలు చేసేటప్పుడు కొన్ని వస్తువులు సడన్ గా పడిపోతుంటాయి.  ఇలా పడిపోవడం అశుభంగా భావిస్తారు. ఈ రోజు మనం అలాంటి కొన్ని విషయాలు గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంకుమ పడిపోవడం: కుంకుమను అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి చేతిలో నుండి కుంకుమ జారి కింద పడినట్లయితే ఆ వ్యక్తి కుటుంబానికి ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం.  కుంకుమ కింద పడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పాదంతో శుభ్రం చేయకూడదు లేదా చీపురుతో శుభ్రం చేయకూడదు. దానిని శుభ్రమైన గుడ్డతో తీసి ఒక పెట్టెలో ఉంచాలి.  


ప్రసాదం పడిపోవడం: పూజా నైవేద్యాలు చేతుల నుండి పడటం కూడా అశుభంగా భావిస్తారు. మీరు కింద పడ్డ ప్రసాదాన్ని తినకపోతే, దానిని నీటిలో వేయాలి లేదా ఒక కుండలో వేయాలి. 


కలశం పడిపోతే: పూజ కోసం కలశంతో నీటిని తీసుకువెళుతున్నప్పుడు చేతి నుండి జారి పడిపోతే, అది అశుభంగా పరిగణిస్తారు. చేతుల నుంచి నీరు రాలిందంటే పూర్వీకులకు కోపం వస్తుందని నమ్ముతారు. దీని వల్ల మీ ఇంట్లో సమస్యలు రావచ్చు. 


దేవుని విగ్రహం: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, దేవుని విగ్రహాన్ని శుభ్రం చేసేటప్పుడు లేదా ఎత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని విగ్రహం పొరపాటున చేతి నుంచి కిందపడి పగలిందంటే దానిని అశుభంగా భావిస్తారు. దీంతో ఆ కుటుంబంలోని పెద్దకు ఆపద రావచ్చు.  


దీపం చేజారితే:  పూజా దీపం చేతి నుండి పడిపోవడం మంచిది కాదని భావిస్తారు. దీని వల్ల మీపై దేవతలు కోపంగా ఉన్నారని అర్థం.  ఇలా జరిగినప్పుడు మీ కులదైవాన్ని ఆరాధించి రెండు దీపాలు వెలిగించండి. 


Also Read: Mangala Gauri Vratam: శ్రావణంలో మంగళ గౌరి వ్రతం ఎందుకుంటారు, ఆ వ్రతం కధేంటి 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook