Mangala Gauri Vratam: హిందూమతంలో మంగళ గౌరి వ్రతానికి విశేష మహత్యముంది. వివాహితులైన మహిళలు శ్రావణ మాసం మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అసలు మంగళ గౌరి వ్రతం అంటే ఏంటి, లాబాలేంటో చూద్దాం..
శ్రావణమాసం ప్రత్యేక మంగళవారం నాడు మంగళ గౌరి వ్రతం ఉంటటారు. ఈ ఏడాది తొలి మంగళ గౌరి వ్రతం జూలై 19 అంటే రేపుంది. ఈ రోజున పార్వతీ దేవి పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తారు. వివాహితులైన మహిళలు భర్త దీర్ఘాయుష్షు , సౌభాగ్యం, సుఖమైన దాంపత్య జీవితం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల ఆ మహిళ కుటుంబం, సంతానం అంతా సుఖ జీవితం పొందుతారు. మంగళ గౌరి వ్రతం కధేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మంగళ గౌరి వ్రతం కధేంటి
పౌరాణిక గాధల ప్రకారం ఓ నగరంలో ధర్మపాలుడనే ధనిక వ్యాపారి ఉంటాడు. అతడి వద్ద చాలా సంపద ఉంటుంది. అతని భార్య చాలా సౌందర్యవతి. కానీ సంతానం లేకపోవడంతో ఇద్దరూ బాధపడుతుంటారు. చాలా కాలం తరువాత శివుడి కటాక్షంతో వారికొక పుత్రుడు జన్మిస్తాడు. కానీ అల్పాయుష్షుతో. అతడి ఆయుష్షు 16 ఏళ్లే. 16 ఏళ్ల వయస్సులో పాము కాటుతో మరణిస్తాడని శాపముంటుంది. మరోవైపు 16 ఏళ్ల కంటే ముందే ఆ బాలుడికి వివాహం కూడా అయిపోతుంది. ఆ బాలుడికి భార్యగా వచ్చిన అమ్మాయి తల్లి శ్రావణమాసంలో మంగళ గౌరి వ్రతం ఆచరిస్తుంటుంది. మంగళ గౌరి వ్రతంతో కుమారుడి వివాహ జీవితం సుఖమయం కావాలని ఆశీర్వాదం పొందుతుంది. దాంతో ఆమె కుమార్తెకు విధవ అయ్యే పరిస్థితి ఉండదు.
మంగళ గౌరి వ్రతం కారణంగా ఆ ప్రభావంతో ఆ బాలుడికి 100 ఏళ్ల వయస్సు ప్రాప్తిస్తుంది. ఇద్దరూ సుఖంగా జీవిస్తుంటారు. అందుకే వివాహితులైన మహిళలంతా భర్త ఆయుష్షు కోసం మంగళ గౌరి వ్రతం ఆచరిస్తుంటారు. మంగళ గౌరి వ్రతం ఆచరించే మహిళలకు నియమాలు పూర్తిగా పాటిస్తారు. తద్వారా దాంపత్య జీవితం సుఖమయంగా దీర్ఘకాలం కొనసాగాలని ఆశిస్తారు. ఈ వ్రత పూజలో 16 ఒత్తుల దీపంతో పార్వతీ దేవికి హారతి ఇస్తారు. కనీసం ఐదేళ్లపాటు ఈ వ్రతం ఆచరిస్తుంటారు.
ఆరోగ్య కారణాల దృష్ట్యా ఏ మహిళలలైతే మంగళ గౌరి వ్రతం ఆచరించలేరో..ఆ మహిళలు అదే రోజున పార్వతీ దేవి పూజ చేయాలి. మంగళ గౌరి వ్రతం కధ వినాలి. తద్వారా ఆ వ్రతం పుణ్యం పొందాలి.
Also read: Naga Panchami 2022: నాగపంచమి ఎప్పుడు, శుభ సమయం, పూజా విధానం గురించి తెలుసుకోండి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook