Maa Lakshmi: బ్రహ్మ ముహూర్తంలో ఈ పనులు చేస్తే... మీపై డబ్బు వర్షం కురిపించనున్న లక్ష్మీదేవి..
Astro tips for Money: లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి వాస్తు శాస్త్రంలో అనేక చిట్కాలు చెప్పబడ్డాయి. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం.
Maa Lakshmi Blessings: గ్రంధాలలో లక్ష్మీదేవిని సంపదలకు దేవతగా వర్ణిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారి అదృష్టం క్షణాల్లో మారిపోతుంది. ఆ తల్లి కటాక్షం ఉంటే మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, లక్ష్మీదేవి ఆగమనానికి అనుకూలమైన సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో చేసే శుభకార్యాలకు లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చర్యలు చేయాలో తెలుసుకుందాం.
ఇంటిని శుభ్రం చేయండి
తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని నమ్ముతారు. శుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే లక్ష్మిదేవి నివసిస్తుందని చెబుతారు. అందుకే మీరు మీ ఇల్లు మరియు పని ప్రదేశంలో ఎల్లప్పుడూ పరిశుభ్రత పాటించాలి. శుక్రవారం దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
తులసి మెుక్కకి నీరు పోయండి..
తులసి మొక్కలో కూడా లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు, కాబట్టి తులసి మొక్కకు ఎల్లప్పుడూ నీటిని పోయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం ఉంటుంది. తులసి చెట్టుకు నీరు పోసేటప్పుడు - 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే విష్ణు మంత్రాన్ని జపించండి.
Also Read: Surya Grahan 2023: మరో నాలుగు రోజుల్లో ఈ రాశులకు మహార్ధశ.. ఇందులో మీరున్నారా?
సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి..
రోజూ ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. అంతేకాకుండా మిమ్మల్ని వ్యాధులు చుట్టముట్టవు.
నెయ్యి దీపం వెలిగించండి
ఉదయాన్నే ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలని చెబుతారు. దీపంలో సకల దేవతలు నివసిస్తారు అని శాస్త్రాలలో చెప్పబడింది. ఇలా చేస్తే అన్ని విపత్తులు తొలగిపోతాయి. దీనితో పాటు మా లక్ష్మీ ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. దీని వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. అలాగే రోజూ దీపం వెలిగించడం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయి.
Also Read: Guru Gochar 2023: మరి కొన్ని గంటల్లో ఈ 4 రాశుల జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.