Goddess Lakshmi: మనం ఎంత కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ అది మన దగ్గర నిలవదు. ఏదో రూపంలో ఖర్చు అయిపోయిపోతూ ఉంటుంది. కొంత మంది పెద్దగా కష్టపడపోయినప్పటికీ సులువుగా డబ్బు వస్తుంది. ఎందుకంటే వారిపై లక్ష్మీదేవి (Goddess Lakshmi) అనుగ్రహం ఉండటమే కారణం. మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా మన ఇంట్లోకి దురదృష్టం ప్రవేశించేలా చేస్తుంది. ఇంట్లోకి అదృష్టం రావాలంటే ఈ 4 పనులు చేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చర్యలు తీసుకోండి
>> సూర్యుడు అస్తమించిన తర్వాత తుడవడం చేయకూడదని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇల్లు, షాపుల్లో రాత్రిపూట శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించి..కుటుంబంలో గొడవలు మెుదలవుతాయి. దీంతో మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. గది శుభ్రంగా లేకపోతే మీ అదృష్టం కూడా దురదృష్టంగా మారుతుంది. 
>>  బహిరంగ ప్రదేశంలో ఉమ్మివేయడం అసభ్యతకు చిహ్నంగా భావిస్తారు. అదే మీరు గుడి,ఇల్లు వంటి స్థలాలలో  ఉమ్మి వేస్తే... తల్లి లక్ష్మీ మీ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. దీని కారణంగా మీరు పేదవారిగా మారుతారు. అందుకే బహిరంగ ప్రదేశంలో ఉమ్మి వేయడం మానుకోండి. 
>> బాత్రూమ్ చంద్రుని ప్రదేశంగా భావిస్తారు. బాత్‌రూమ్‌ శుభ్రంగా లేకపోతే మీ ఇంట్లోకి వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా మీ జాతకంలో చంద్రునిపై గ్రహణం ఏర్పడుతుంది. దీంతో మీ సంపద అంతా పోతుంది. అందుకే బాత్రూమ్ ని శుభ్రంగా ఉంచుకోండి. 
>> మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ ప్లేట్‌లో ఉంచవద్దు. అంతేకాకుండా మురికి పాత్రలను కడకుండా వదిలేయవద్దు. ఈ రెండు మీ ఇంట్లో దురదృష్టాన్ని ఆహ్వానిస్తాయి. మీరు రాత్రి పడుకున్నప్పుడల్లా మురికి పాత్రలను కడిగి పడుకోండి.


Also Read: Sun Transit effect on Scorpio: సూర్యుడి రాశి మార్పు.. ఆగస్టు 17 నుండి ఈ రాశివారికి డబ్బే డబ్బు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook