Rahu Kethu Dosham: రాహుకేతువుల దోషమనేది జీవితంలో చాలా సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఆ జాతకుడు చెడు అలవాట్లకు లోనవుతాడు. అందుకే రాహుకేతువులంటే అందరికీ భయమే. అయితే కొన్ని పద్ధతుల ద్వారా విముక్తి పొందవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహుకేతువులను జ్యోతిష్యశాస్త్రంలో ఛాయాగ్రహాలుగా పిలుస్తారు. పాప గ్రహాలని కూడా అంటారు. ఒకవేళ కుండలిలో రాహుదోషం లేదా కేతువు దోషముంటే..జీవితంలో చాలా కష్టాలు ఎదురౌతాయి. ఈ జాతకులకు జీవితంలో ఒకదాని తరువాత మరొకటిగా కష్టాలు వస్తుంటాయి. అయితే రాహుకేతువుల దోషం దూరం చేసేందుకు జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. 


రాహుదోషముంటే ఆ వ్యక్తికి నిద్ర పట్టదు. కడుపు, మెదడు, ఎముకలు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. దాంతోపాటు వ్యక్తి చాలా బద్దకస్థుడిగా మారిపోతాడు. రాహు దోషం నుంచి కాపాడుకునేందుకు ముందుగా చెడు అలవాట్లను మానుకోవాలి. ఉపశమనం కలిగే మార్గాల్ని త్వరగా అనుసరించాలి. అటు కుండలిలో కేతువు దోషముంటే..చర్మ రోగాలు, చెవిపోటు సమస్య వస్తుంది. వినికిడి శక్తి కూడా తగ్గిపోతుంది. జాయింట్ పెయిన్స్, మోకాలి నొప్పులు వంటివి ఎదురౌతాయి.


రాహు కేతువులనేవి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఛాయా గ్రహాలు. వీటి చెడు ప్రభావం నుంచి కాపాడుకునేందుకు దుర్గాదేవిని పూజించాలి. రాహుకేతువుల దోషం నుంచి విముక్తి పొందేందుకు నాగుపాముపై నృత్యం చేస్తున్న కృష్ణుడి బొమ్మను ముందు పెట్టుకుని...రోజూకు 108 సార్లు ఓమ్ నమహ భగవతే వాసుదేవాయ మంత్రాన్ని పఠించాలి.


రాహుకేతువు గ్రహాలకు సంబంధించిన వస్తువుల్ని దానం చేయాలి, రోజూ బీజ మంత్రాన్ని పఠించాలి. రాహుకేతువుల చెడు ప్రభావం నుంచి కాపాడుకునేందుకు పేద అమ్మాయి పెళ్లికి సహాయం చేయాలి. కుండలిలో రాహుదోషముంటే..తేలికైన నీలిరంగు బట్టలు ధరించాలి. అటు కేతుదోషముంటే...తేలికైన గులాబీ రంగు బట్టలు ధరించాలి. అటు దానం కూడా చేయాలి. రాహుకేతు దోషాల్ని దూరం చేసేందుకు పంచముఖ శివుడి ముందు రుద్రాక్ష మాలతో రోజూ ఓమ్ నమహ శివాయ మంత్రాన్ని జపించాలి.


Also read: Virgo September Horoscope: కన్యారాశివారికి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది. అనుకూలమా ప్రతికూలమా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook