Lemon Remedies: నిమ్మకాయతో ఇలా చేసినప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు..మీ ఇంట అష్ట ఐశ్వర్యాలే
Lemon Remedies: జ్యోతిష్యశాస్త్రంలో నిమ్మకాయలకు విశేష ప్రాధాన్యత ఉంది. నిమ్మకాయల్ని సరైన రీతిలో ఉపయోగిస్తే ఆ వ్యక్తి సంపదలతో తులతూగుతాడు. ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరమౌతాయి.
Lemon Remedies: జ్యోతిష్యశాస్త్రంలో నిమ్మకాయలకు విశేష ప్రాధాన్యత ఉంది. నిమ్మకాయల్ని సరైన రీతిలో ఉపయోగిస్తే ఆ వ్యక్తి సంపదలతో తులతూగుతాడు. ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరమౌతాయి.
కొంతమందికి కష్టించిన దానికి ప్రతిఫలం లభించదు. చాలాసార్లు వ్యక్తి అదృష్టం కలిసిరాదు. ఈ పరిస్థితుల్లో జ్యోతిష్యశాస్త్రంలో చాలా మార్గాలు, ఉపాయాలు ఉన్నాయి. ఇవి పాటిస్తే ఆ వ్యక్తికి అదృష్టం కలిసొస్తుంది. తాంత్రిక గ్రంధాల్లో నిమ్మకాయల ప్రస్తావన చాలా ఎక్కువ. ఆ నిమ్మకాయల సహాయంతో జీవితంలో ఎదురవుతున్న సమస్యల్ని చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు.
ఒకవేళ వ్యాపారంలో కలిసిరాకపోతే..నష్టాలు ఎదురవుతుంటే శనివారం నాడు ఓ నిమ్మకాయను నాలుగు ముక్కలు చేసి, నాలుగు జంక్షన్లకు వెళ్లి..నలువైపులా ఒక్కొక్క ముక్క పడేయాలి. ఇలా చేస్తే వ్యాపారంలో అభివృద్ధి కన్పిస్తుంది. ఎవరిదైనా దిష్టి తగిలితే అతని తలపైనుంచి 7 సార్లు నిమ్మకాయ తిప్పి..నాలుగు ముక్కలు చేసి ఏదైనా నిర్మాణుష్య ప్రాంతంలో పడేయాలి. దీనివల్ల ఆ వ్యక్తి దిష్టి పోతుంది.
ఏదైనా పనిలో సాఫల్యం కోసం నిమ్మకాయకు ఓ లవంగ తగిలించి..హనుమంతుడి ఆలయానికి వెళ్లి..పూజలు చేయాలి. ఆ తరువాత హనుమంతుడిని ప్రార్ధించాలి. ఆ తరువాత ఆ నిమ్మకాయతో పని ప్రారంభించాలి. దీనివల్ల మీకు విజయం లభిస్తుంది. ఒకవేళ జరుగుతున్న పనులు కూడా నిలిచిపోతున్నా లేక చెడిపోతున్నా నిమ్మకాయను దిష్టి తీయాలి. ఆ తరువాత రెండు ముక్కలు చేసి..ఒ ముక్కను ఎడమవైపుకు, మరో ముక్కను కుడివైపులు విసిరేయాలి. ఇలా చేయడం వల్ల చెడిన మీ పనులు పూర్తవుతాయి.
ఉద్యోగం కోసం నిరంతరం కష్టపడుతున్నా..ప్రతిఫలం లభించకపోతే రాత్రి 12 గంటలకు నాలుగు రోడ్లు జంక్షన్‌కు వెళ్లి..ఓ నిమ్మకాయను నాలుగు ముక్కలు చేసి నలువైపులా దూరంగా విసిరేయాలి. నిమ్మకాయతో ఏదైనా చేసేటప్పుడు వెనక్కి తిరిగి ఎప్పుడూ చూడకూడదు.ఇంకెక్కడికీ వెళ్లకూడదు. నిమ్మకాయతో చేయాల్సింది చేసిన తరువాత నేరుగా ఇంటికెళ్లిపోవాలి. రోడ్డుపై పడిన నిమ్మకాయలు, ఎండిమిర్చిపై ఎప్పుడూ కాలు వేయకూడదు. ఈ విషయాలు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.
Also read: Sunset Time: సూర్యాస్తమయం వేళ ఆ పనులు చేస్తే..లక్ష్మీదేవికి ఆగ్రహం
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook