Sunset Time: జ్యోతిష్యశాస్త్రంలో చాలా విషయాల గురించి ప్రస్తావన ఉంది. సూర్యాస్తమయం విషయమై కొన్ని ప్రత్యేక సూచనలున్నాయి. సాయం సంధ్యవేళ ఏం చేయకూడదో విపులంగా ఉంది.
చాలా సందర్భాల్లో సమయం ఎప్పుడు లభిస్తే అప్పుడు ఏ పనైనా చేస్తుంటారు. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినడం, ఎప్పుడు నిద్ర పడితే అప్పడు నిద్రపోవడం ఇలా. జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి పనికీ నిర్ణీత సమయముంది. సూర్యాస్తమయం వేళ కొన్ని పనులు చేయవద్దని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఎవరైనా అలా చేస్తే అశుభంగా భావిస్తారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సంధ్యవేళ అంటే సాయంత్రం సమయంలో పడుకోకూడదు. చీపురు పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఆ వ్యక్తి ఆర్దిక ఇబ్బందుల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. సాయంత్రం సమయంలో సరస్వతి దేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవి వస్తారని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అందుకే సాయం వేళ ఏం చేయకూడదో ఇప్పుడు పరిశీలిద్దాం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..సాయంత్రం వేళ నిద్రపోయే అలవాటుండకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దాంతోపాటు వ్యక్తి ఆయుష్షు తగ్గుతుంది. హిందూమతం ప్రకారం సూర్యాస్తమయం, సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఇంటికొస్తుంది. అందుకే సాయంత్రం వేళ ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి. సాయంత్రం వేళ పడుకుంటే నెగెటివ్ ఎనర్జీ ప్రసరితమౌతుంది.
సూర్యాస్తమయం వేళ ఇంట్లో చీపురు పొరపాటున కూడా పెట్టకూడదు. అంటే చీపురుతో ఇళ్లు తుడవడం చేయకూడదు. ఇది పూర్తిగా అశుభం. ఇలా చేస్తే లక్ష్మీదేవి అలిగి..ఇంట్లోంచి వెళ్లిపోతుంది. ఈ సమయం శివుడి పూజా సమయం. ఈ సందర్భంగా దేవుడిని ధ్యానం చేయాలి.
Also read: Vastu Tips: ఇంట్లో ఆ విగ్రహాన్ని సరైన దిశలో ఉంచితే..అద్భుతం కన్పిస్తుంది
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook