జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులకు అమితమైన సంబంధముంది. ప్రతి గ్రహం ఏదో ఒక నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది. అదే క్రమంలో రాహు, కేతు గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఉంది. రాహు, కేతు గ్రహాలంటే భయపడే పరిస్థితి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతం ప్రకారం జ్యోతిష్యానికి కీలక స్థానముంది. ముఖ్యంగా రాహు, కేతువుల ప్రభావం గురించి ఇందులో చాలా సందర్భాల్లో ప్రస్తావన ఉంది. ఈ రెండు గ్రహాల్ని ఛాయాగ్రహాలుగా పిలుస్తారు. అదే సమయంలో పాప గ్రహాలని కూడా అంటారు. ఎవరైనా వ్యక్తి కుండలిలో రాహుకేతువుల దోషముంటే..ఆ వ్యక్తులకు జీవితమంతా కష్టాలే. జీవితంలో ఒకదాని వెంట మరొక సమస్య వస్తుంది. అందుకే రాహు, కేతువులంటే భయపడిపోయే పరిస్థితి. అయితే ఈ సమస్య నుంచి విముక్తి చెందేందుకు కొన్ని పద్ధతులున్నాయి


ప్రతి జ్యోతిష్యానికి కుండలి ఆధారం. అంటే ప్రతి వ్యక్తి కుండలి వేర్వేరుగా ఉంటుంది. ఈ కుండలిలో రాహుదోషముంటే ఆ వ్యక్తికి నిద్ర పట్టదు. కడుపు, మెదడు, ఎముకలు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. దాంతోపాటు వ్యక్తి చాలా బద్దకస్థుడిగా మారిపోతాడు. రాహు దోషం నుంచి కాపాడుకునేందుకు ముందుగా చెడు అలవాట్లను మానుకోవాలి. ఉపశమనం కలిగే మార్గాల్ని త్వరగా అనుసరించాలి. అటు కుండలిలో కేతువు దోషముంటే..చర్మ రోగాలు, చెవిపోటు సమస్య వస్తుంది. వినికిడి శక్తి కూడా తగ్గిపోతుంది. జాయింట్ పెయిన్స్, మోకాలి నొప్పులు వంటివి ఎదురౌతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. 


వాస్తవానికి జ్యోతిష్యం ప్రకారం రాహు కేతువులు రెండు ఛాయా గ్రహాలు. వీటి చెడు ప్రభావం నుంచి కాపాడుకునేందుకు దుర్గాదేవిని పూజించాలి. రాహుకేతువుల దోషం నుంచి విముక్తి పొందేందుకు నాగుపాముపై నృత్యం చేస్తున్న కృష్ణుడి బొమ్మను ముందు పెట్టుకుని...రోజూకు 108 సార్లు ఓమ్ నమహ భగవతే వాసుదేవాయ మంత్రాన్ని పఠిస్తే మెరుగైన ఫలితాలుంటాయి.


రాహుకేతువుల సమస్య..ఏం చేయాలి


ఈ సమస్య ఉన్నప్పుడు రాహుకేతువు గ్రహాలకు సంబంధించిన వస్తువుల్ని దానం చేయాలి, రోజూ బీజ మంత్రాన్ని పఠించాలి. రాహుకేతువుల చెడు ప్రభావం నుంచి కాపాడుకునేందుకు పేద అమ్మాయి పెళ్లికి సహాయం చేయాలి. కుండలిలో రాహుదోషముంటే..తేలికైన నీలిరంగు బట్టలు ధరించాలి. అటు కేతుదోషముంటే...తేలికైన గులాబీ రంగు బట్టలు ధరించాలి. అంటే దాన కార్కక్రమాలు అధికంగా చేయాలి.


Also read: Mangal Vakri 2022: అరుదైన రాజయోగం.. ఈ 4 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Lin- https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook