Navgraha Dosha Remedies: మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. జ్యోతిష్యశాస్త్రంపై నమ్మకం ఉన్నవారు ఈ సమస్యల పరిష్కారానికి నవగ్రహాల (Navgraha Dosha) శాంతి కోసం కొన్ని పరిహారాలు చేస్తారు. ఇవి చేయడం వల్ల  దోషాల నుంచి విముక్తి పొందడమే కాకుండా... మన లైఫ్ లోని ఇబ్బందులు తొలగిపోతాయి. ఇలాంటి చర్యలలో ఒకదాని గురించి ఇప్పుడు  చెప్పుకుందాం. నీటిలో కొన్ని వస్తువులు కలిపి స్నానం చేయడం ద్వారా అవాంఛనీయ సంఘటనలను చాలా వరకు తగ్గించవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుడు (Sun)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్య గ్రహ ప్రభావాలను తగ్గించడానికి స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వులు, ఏలకులు, కుంకుమ, మరియు రోజ్మేరీని కలిపి స్నానం చేయండి.
చంద్రుడు (Moon)- చంద్రుని యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించడానికి స్నానపు నీటిలో తెల్లటి చందనం, తెల్లని సువాసనగల పువ్వులు, రోజ్ వాటర్ లేదా శంఖంతో నీటిని నింపి స్నానం చేయండి.
కుజుడు (Mars)- అంగారకుడి వల్ల కలిగే దుష్ఫలితాలు తగ్గడానికి.. స్నానం చేసే నీటిలో ఎర్రచందనం, బెరడు, బెల్లం కలిపి స్నానం చేస్తే మేలు జరుగుతుంది.
బుధుడు (Mercury) - బుధ గ్రహం ప్రభావం తగ్గాలంటే జాజికాయ, తేనె, అన్నం కలిపి స్నానం చేయాలి.
బృహస్పతి (Jupiter)- పసుపు ఆవాలు, వేపచెట్టు మరియు బెల్లం పువ్వులను స్నానపు నీటిలో కలపండి. దీని ద్వారా మీ జాతకంలో గురుగ్రహం యొక్క అశుభాలు తగ్గి..శుభ ఫలితాలు పెరుగుతాయి.


శుక్రుడు (Venus)- జాతకంలో శుక్రగ్రహం వల్ల కలిగే దుష్ఫలితాలు తగ్గాలంటే.. ఆ నీటిలో పన్నీరు, యాలకులు, తెల్లని పువ్వులు వేసి స్నానం చేస్తే మేలు జరుగుతుంది.
శనీశ్వరుడు (Saturn) - నల్ల నువ్వులు, సోపు, యాంటీమోనీ లేదా సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయడం వల్ల శనిగ్రహం యొక్క చెడు దృష్టి నుంచి బయటపడవచ్చు
రాహువు (Rahu)- స్నానం చేసే నీటిలో కస్తూరి, సుగంధ ద్రవ్యాలు కలపడం వల్ల రాహువు చెడు ప్రభావం తగ్గుతుంది.
కేతువు (Ketu)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కేతువు యొక్క కష్టాలు తొలగిపోవాలంటే, స్నానం చేసే నీటిలో సుగంధ ద్రవ్యాలు, ఎర్ర చందనం కలపండి. 


Also Read: Sun transit 2022: సూర్యుడి కర్కాటక ప్రవేశం, జూలై 16 నుంచి ఆ రాశివారికి అన్నీ కష్టాలే



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook