Chandra Dosh Nivaran Remedies: శివుడికి ఎంతో ఇష్టమైన నెల శ్రావణ మాసం. ఈ మాసంలోని సోమవారాల్లో శివారాధన చేస్తారు.  ఈ రోజు  రెండో శ్రావణ సోమవారం మరియు ప్రదోష వ్రతం కూడా. ఈ రోజున శివుడిని పూజిస్తే.. గ్రహ దోషాలు తొలగిపోతాయి. చంద్ర దోషాన్ని (Chandra Dosham) పోగొట్టుకోవడానికి శ్రావణ సోమవారం పవిత్రమైన రోజు. ముఖ్యంగా ఈ రోజు చంద్ర దోష నివారణకు చర్యలు తీసుకుంటే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. మీ జాతకంలో చంద్ర దోషం ఉంటే... మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దీని వల్ల నిద్ర, అలసట, ఒత్తిడి తదితర సమస్యలు ఎదుర్కొంటారు. చంద్ర దోషాన్ని తొలగించడానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతకంలో చంద్ర దోషం ఉన్నవారు శ్రావణ సోమవారం ఉపవాసం ఉండి.. దోష నివారణకు పూజలు చేయండి. ముఖ్యంగా ఈ రోజు చంద్రుడిని పూజించండి. రుద్రాక్ష జపమాలతో 'ఓం శ్రం శ్రీ శ్రమ సః చంద్రాంశే నమః' అనే మంత్రాన్ని జపించండి. శివుడు చంద్రుడిని ధరిస్తాడు, కాబట్టి చంద్ర దోషాన్ని తొలగించడానికి శివుడిని పూజించడం చాలా ఉత్తమమైన మార్గం. ఇందుకోసం సోమవారం శివలింగానికి వెండి కమలంతో పాలు సమర్పించండి. పెరుగు, తెల్లని బట్టలు, తెల్ల చందనం, బియ్యం మరియు పంచదార మిఠాయి వంటి ఇతర తెల్లని వస్తువులను కూడా అందించండి. వాటిని కూడా అవసరమైన వారికి దానం చేయండి. అంతే కాకుండా వెండి ఉంగరంలో ముత్యాన్ని ధరించడం కూడా చంద్ర దోషాన్ని పోగొట్టుకోవచ్చు.  


Also Read: Kamika Ekadashi 2022: కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వ్రతంలో పసుపు రంగుకు ఎందుకు అంత ప్రాధాన్యత?



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook