Kamika Ekadashi 2022: కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వ్రతంలో పసుపు రంగుకు ఎందుకు అంత ప్రాధాన్యత?

Kamika Ekadashi 2022: శ్రావణ మాసంలో వచ్చే తొలి ఏకాదశినే కామికా ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును  పూజిస్తారు. ఈ వ్రత ప్రాముఖ్యత తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 22, 2022, 11:52 AM IST
Kamika Ekadashi 2022: కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వ్రతంలో పసుపు రంగుకు ఎందుకు అంత ప్రాధాన్యత?

Kamika Ekadashi 2022: శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి నాడు కామికా ఏకాదశిని జరుపుకుంటారు. ఈసారి కామికా ఏకాదశి (Kamika Ekadashi 2022) మరో రెండు రోజుల్లో రానుంది. ఏకాదశి అంటేనే ముఖ్యంగా విష్ణువును పూజిస్తారు. అలాంటి శ్రావణ మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజున శ్రీహరిని  ఆరాధిస్తే మీరు సకల బాధల నుండి విముక్తి పొందుతారు. 

శ్రావణ మొదటి ఏకాదశి ఎప్పుడు?
శ్రావణ మాసంలో కామిక ఏకాదశి తిథి శనివారం, 23 జూలై 2022న ఉదయం 11.27 గంటలకు ప్రారంభమై... 24 జూలై 2022 ఆదివారం మధ్యాహ్నం 1:45 గంటల వరకు ఉంటుంది. ఉదయతిథి ప్రకారం, జూలై 24న కామికా ఏకాదశి వ్రతం పాటిస్తారు. 

పసుపు రంగుకు ప్రాధాన్యత
ఈ ఏకాదశి రోజున పసుపు రంగుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కామికా ఏకాదశి వ్రతంలో పసుపు బట్టలు ధరించి విష్ణువును పూజిస్తే.. శ్రీహరి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. వీలైతే పసుపు పుష్పాలను సమర్పించడం కూడా మీకు మేలు చేస్తుంది.  

బ్రహ్మ హత్యా దోషం నుండి విముక్తి 
ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును పూజించడం మతపరమైన పుణ్యక్షేత్రంలో పవిత్ర నదులలో స్నానం చేయడంతో సమానం. అది బ్రహ్మహత్యాపాతకం నుండి మిమ్మిల్ని విముక్తి చేస్తుంది.  శ్రావణ మాసంలో కామికా ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా.. శ్రీహరి అనుగ్రహాన్ని కూడా పొందుతారు. 

Also Read: Angarak Yoga: అంగారక యోగం ఎఫెక్ట్... మరో 9 రోజుల్లో ఈ 5 రాశులవారికి చెడు రోజులు మెుదలు..! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News