Astrology:జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయికకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి వాటిలో బుధుడితో శుక్ర గ్రహం కలయికను అరుదైన లక్ష్మీ నారాయణ యోగంగా పరిగణిస్తారు. ఈ యోగం ఈ నెల 19 వరకు ఉంటుంది. ఇది చంద్రునికి సంబంధించిన కర్కాటక రాశిలో ఏర్పడింది.  ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏయే రాశుల వారికీ అపార ధనయోగం కలగనుందో మీరు ఓ లుక్కేయండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథున రాశి


బుధ, శుక్ర గ్రహాల కలయికతో ఏర్పడిన లక్ష్మీ నారాయణ యోగం మిథున రాశి వారికి అత్యధిక ప్రయోజనం కలగజేయనుంది.  ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు పెండింగ్ లో ఉన్న బకాయిలు వస్తాయి.  వ్యాపార పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉంటుంది.  గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితిలో పెను మార్పులు ఉంటాయి.  ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం.


కర్కాటక రాశి


బుధుడు మరియు శుక్రుడు కలయిక వల్ల  ఏర్పడిన లక్ష్మీ నారాయణ యోగం ఈ రాశి వారికి అనుకోని ధనలాభం కలగనుంది. ఈ రాశి వ్యాపారస్తులకు అత్యంత అనుకూలమైన సమయం. గత కొంత కాలంగా ఎదురు చూస్తోన్న డబ్బు చేతికి అందుతుంది.  అప్పుల బాధ నుండి  విముక్తి పొందుతారు. మీరు కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేస్తారు. ఈ సమయం పెట్టుబడికి కూడా అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది.


మకరరాశి


బుధుడు మరియు శుక్రుడు కలయికతో ఏర్పడిన లక్ష్మీ నారాయణ యోగం వల్ల మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.  వ్యాపారులకు గ్రహాల అనుకూల ప్రభావం వల్ల అంతా మంచే జరగుతుంది.  గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు కనుమరుగు అవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం వల్ల ఉల్లాసమైన జీవితం గడుపుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం.



పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.


Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.