Astology: మరో నెల రోజుల్లో కీలక గ్రహ మార్పు.. ఈ రాశుల వారికీ లాటరీ తగిలినట్టే..
Astology: మార్చి నెలలలో గ్రహాల రారాజు అయిన సూర్యుడు మీనరాశిలోకి ప్రవేంచనున్నాడు. సూర్యుడు, రాహువు కలయిక వల్ల కొంత మందికి అదృష్టం తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. కొంత మందికి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
Astrology: సూర్య, రాహు రాశి ఫలితాలు.. ప్రస్తుతం రాహువు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక్కడ సూర్య భగవానుడు త్వరలో ప్రవేశించనున్నాడు. మర్చి 14న సూర్యుడు మీనంలో ప్రవేశించనున్నాడు. ఈ సందర్బంగా కొన్ని రాశుల వారి జీవితంలో పెను మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం రవి మకరంలో ఉన్నాడు.
వృషభ రాశి: వృషభ రాశి వారికీ, రవి, రాహువు కలయిక వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ధన లాభం పొందే అవకాశాలున్నాయి. అయితే ఖర్చుల విషయంలో అప్రమత్తత అవసరం. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి.
సింహ రాశి:
సూర్య, రాహువు కలయికల వల్ల సింహరాశికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయం మరింత పెరిగే అవకాశాలున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అంతేకాదు పాత పెట్టుబడుల నుంచి రాబడిని పొందవచ్చు. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది.
మకర రాశి:
గ్రహ గమనంలో సూర్యుడు, రాహువు కలయికల వల్ల మకరరాశి వారికి మరింత ఆనంద దాయకంగా ఉంటుంది. మీ సోషల్ స్టేటస్ పెరుగుతుంది. కెరీర్ డిబేట్‌లలో పాల్గొంటే శత్రువులు ఏర్పడుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే మంచి తరుణం.
Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
ఇదీ చదవండి: Post Office MIS: పోస్ట్ఆఫీస్ బంపర్ ఆఫర్..జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తేచాలు రూ.5 లక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook