Astrology Facts: ప్రతి రోజూ మీకు ఇలా పక్షులు కనిపేస్తే.. జీవితాంతం డబ్బే.. డబ్బు..!
Astrology Facts: ప్రతి రోజూ మీకు ఇలా పక్షులు కనిపేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్‌లో కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.
Astrology Facts: పురాతన కాలం నుంచి హిందూ మతంలో వివిధ జంతువులు, పక్షుల ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతదేశంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..జంతువులు, పక్షులు ఎదురు పడడం వల్ల శుభ, అశుభమైన సంఘటనలు జరుగుతాయని పేర్కొన్నారు. చిలుక, మైనా, నెమలి, నీలకంఠం వంటి అనేక పక్షులు ఇంట్లో ఉండడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రంలో తెలిపారు. వీటన్నిటినీ పవిత్ర పక్షుల్లా భావిస్తారు. వీటిని ప్రతి రోజూ చూడడం వల్ల మంచి ప్రయోజనాలు కలగడమేకాకుండా ఇంట్లో సమస్యలన్నీ దూరమవుతాయి.
జ్యోతిషశాస్త్రంలో చాలా వాటి గురించి ప్రస్తావించారు. అయితే ఉదయం పూట మీరు చూసిన పక్షిని బట్టి రోజంతా ఎలా గడుస్తుందో శాస్త్రంలో తెలిపారు. కాబట్టి ప్రతి రోజూ ఇంట్లో ఎలాంటి పక్షులు చూడడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా వీటిని చూడడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం..
ఇంట్లో పక్షులను చూడటం శుభ సంకేతం:
ఏదైనా పక్షి, పిచ్చుకను ఇంట్లో చూస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇవి ఇంట్లోకి ప్రవేశించినా లేదా గూడు కట్టినా అది చాలా శుభప్రదంగా జోతిష్య వాస్తు శాస్త్రం పరిగణించింది. తెల్లవారుజామున ఇంట్లో పక్షుల కిలకిలారావాలు వింటుంటే అది శుభసూచకమేనని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా దీని వల్ల కుటుంబంలో సంతోషాలు, శాంతి కలుగుతుంది. ఉదయాన్నే కోడి కూత వినడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు, చిలుక, నెమలి, నీలి కంఠం, తెల్ల పావురం, పిచ్చుక లేదా మైనా రోడ్డు దాటుతున్నప్పుడు కనిపిస్తే.. అది కూడా శుభసూచకమేనని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఇవి ఎదురైతే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారని ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
అయితే ఒక కాకి లేదా డేగ గోళ్లతో మాంసం ముక్కను మోస్తూ కనిపిస్తే.. అది కూడా శుభప్రదంగా పరిగణించింది జోతిష్య శాస్త్రం. ఏదైనా ప్రత్యేక పని కోసం వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో మాంసం ముక్కను మోసుకెళ్తున్నట్లు కనిపిస్తే ఏ పనిలోనై 100% విజయం సాధిస్తారు. అంతేకాకుండా జీవితాంతం ఆర్థికంగా బలంగా ఉంటారు.
Also Read : Bihar Road accident: భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు... 12 మంది దుర్మరణం..
Also Read : Telangana: అయ్యప్ప పూజకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ... ఐదుగురు దుర్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook