Astrology: సూర్యుడు త్వరలో శనికి సంబంధించిన కుంభంలోకి ప్రవేశించనున్నాడు. ఈ రోజు సూర్య భగవానుడు మకరం నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో నెల రోజుల పాటు ఉండనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఏయో రాశుల వారికీ మంచి ఫలితాలు.. ఏయో రాశుల వారు చెడు ఫలితాలను అందుకోబోతున్నారో మీరు ఓ లుక్కేయండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
కుంభరాశిలో సూర్యుని సంచారం మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం మరియు గౌరవం చాలా పెరుగుతుంది. కార్యాలయంలో మీ పనిని సీనియర్లు కూడా ప్రశంసిస్తారు. ఈ కాలంలో మీరు కొత్త బాధ్యతలను పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. వ్యాపారులకు సమయం ప్రత్యేకంగా ఉంటుంది.


మిథున రాశి:
సూర్యడు  రాశి మార్పు మిథునరాశి వారికి మంచి ఫలితాలను అందుకోబోతున్నారు. వీళ్లకు విదేశీ యానయోగం ఉంది. పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. అనుకోని డబ్బులు వరిస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.  


వృషభ రాశి :
శని స్వక్షేత్రమైన కుంభరాశిలో సూర్యుడు సంచరించడం వల్ల వృషభ రాశి వారికి మేలు జరుగబోతుంది. సూర్య భగవాడు అనుగ్రహం వల్ల మత పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. నెగిటివ్ ఆలోచన నుంచి బయట పడతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి.


ఈ రాశుల వారికీ కాస్త ప్రతికూలంగా ఉండే అవకాశం..


వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి సూర్య సంచారం కారణంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. ఆర్ధికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీ భాగస్వాములతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తత అవసరం.


మీన రాశి:


మీనరాశి వారికి సూర్య గ్రహ గోచారం కొంత ప్రతికూల ఫలితాలను అందించనుంది. ఆర్ధికంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. మీరు జీవితంలో సవాళ్లను ఎదుర్కొవలసి రావచ్చు. పనులు పూర్తి చేయడంలో కొన్ని అవాంతరాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook