Ketu Mahadasha Effect In Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నవగ్రహాల అంతర్దశ మరియు మహాదశ ప్రతి వ్యక్తిపై కనిపిస్తుంది. వీటి ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై కనిపిస్తుంది. ఆస్ట్రాలజీలో కేతువును ఛాయా గ్రహాంగా పరిగణిస్తారు. సాధారణంగా ప్రజలు కేతు గ్రహాన్ని పాపపు గ్రహాంగా భావిస్తారు. జాతకంలో కేతు దోషం ఉన్నవారు అనేక బాధలతో పీడింపబడతారు. కేతువు ఎప్పుడు చెడు ఫలితాలను ఇవ్వదు. కుండలిలో కేతువు శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి అనేక ప్రయోజనాలను పొందుతాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీవితంపై కేతు మహాదశ ప్రభావం...


ఆస్ట్రాలజీలో కేతు గ్రహం... ఆధ్యాత్మికత, నిశ్శబ్దం, మోక్షం, తాంత్రికత మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. ఒక వ్యక్తి జాతకంలో కేతువు... తృతీయ, పంచమ, ఆరు, నవమ, పన్నెండవ స్థానాలలో ఉంటే ఆ వ్యక్తికి మంచి ఫలితాలు కలుగుతాయి. మరోవైపు గురు గ్రహంతో కేతువు కలయిక ఏర్పడితే జాతకంలో రాజయోగం ఏర్పడుతుంది. కేతువు మనిషిని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తాడు. దీనితో పాటు కేతు గ్రహం పదవ ఇంట్లో ఉంటే ఆ వ్యక్తి జ్యోతిషశాస్త్రంలో మంచి పేరు సంపాదిస్తాడు. కావున కేతు గ్రహ మహాదశ జరుగుతుంటే ఆ వ్యక్తికి శుభ ఫలితాలు కలుగుతాయి. కేతువు యెుక్క మహాదశ ఏడు సంవత్సరాలుపాటు ఉంటుంది.


కేతు గ్రహం మీ జాతకంలో అశుభ స్థానంలో ఉంటే..


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో కేతువు గ్రహం అశుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. మీరు ఏ పనిచేసినా అందులో అడ్డంకులు ఎదురవుతాయి. వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. ఆకస్మిక ఇబ్బందులు తలెత్తుతాయి. మీ జాతకంలో కాలసర్ప దోషం ఏర్పడతుంది. దీంతో మీకు లక్ కలిసిరాదు. ఈ సమయం మీకు అంతగా కలిసి రాదు.


ఈ పరిహారాలు చేయండి


1- జాతకంలో కేతువు అశుభం ఉన్నట్లయితే వారు నలుపు రంగు ఆవును దానం చేయండి.


2- కేతు గ్రహ దుష్ప్రభావాల నుండి విముక్తి పొందడానికి పేద, నిస్సహాయ, వికలాంగులకు ఆహారం, డబ్బు మొదలైనవి దానం చేయండి.


3- నూనెతో పూసిన రొట్టెని కుక్కలకు తినిపించండి. ఇలా చేయడం వల్ల కేతువు యొక్క అశుభాల నుండి విముక్తి పొందవచ్చు.


4- కేతు గ్రహం యొక్క ఓం కే కేత్వే నమః అనే బీజ మంత్రాన్ని జపించండి.


Also Read: Saturn Transit 2022: 30 ఏళ్ల తరువాత కుంభరాశిలో శనిగ్రహం, ఆ రాశులకు రేపట్నించి అంతా నరకమే 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook